8GB ర్యామ్, 5500mAh బ్యాటరీతో OnePlus 5G ఫోన్ విడుదల.. ఫీచర్‌లు, సేల్ వివరాలు..!!
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌లో (Oneplus Nord CE 4 Lite 5G Launched) విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ హ్యాండ్‌సెట్ తర్వాత తరం స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ అయింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ అందుబాటు ధరలో విడుదల అయింది. మూడు రంగుల్లో లభించనుంది. మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. 5500mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరాను కలిగి ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 1080*2400 పిక్సల్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్, 2100 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 20:9 ఆస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది.

వన్‌ప్లస్ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 ను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 695 SoC చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ Adreno 619 GPU, 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడుతుంది.
రెండు వేరియంట్‌లు, 5500mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్, 8GB + 256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మరియు 80W వైర్ Supervooc మరియు 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 1/1.95 అంగుళాల 50MP సోనీ LYT 600 ప్రధాన కెమెరాను అమర్చారు. ఈ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్ సపోర్టును కలిగి ఉంది. మరియు 2MP డెప్త్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్టుతో 16MP కెమెరాను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ 5G, బ్లూటూత్ 5.1, వైఫై 5, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు 3.5mm ఆడియో జాక్, భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా విడుదల అయింది.

వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉంది. అదే 8GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ సేల్ జూన్ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ICICI, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. అమెజాన్, వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో మూడు రంగుల్లో లభించనుంది. మెగా బ్లూ, సూపర్ సిల్వర్, అల్ట్రా ఆరెంజ్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. అయితే మెగా బ్లూ, సూపర్ సిల్వర్ రంగుల స్మార్ట్‌ఫోన్‌లు జూన్ 27 నుంచి కొనుగోలు చేయవచ్చు. అదే అల్ట్రా ఆరెంజ్ కలర్ వేరియంట్‌ను తర్వాత అందుబాటులోకి తీసుకురానుంది.


Click it and Unblock the Notifications