50MP కెమెరా, 5500mAh బ్యాటరీ, 6.67 అంగుళాల డిస్‌ప్లే వన్‌ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్..!
భారత్ మార్కెట్ లో ధర రూ.20,000 కంటే తక్కువ సెగ్నెంట్ లో అనేక బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ బెస్ట్ ఫోన్‌లలో వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ (OnePlus Nord CE 4 Lite 5G Smartphone) ఒకటి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం డిస్కౌంట్‌తోపాటు బ్యాంక్ డీల్స్‌తో మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ వన్‌ప్లస్ ఫోన్ 50MP సోనీ కెమెరా, 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే అద్భుతమైన కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
అదిరిపోయే కలర్ వేరియంట్స్ :
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. ప్రస్తుతం అమెజాన్ లో (Amazon) డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. మెగా బ్లూ, అల్ట్రా ఆరెంజ్, సూపర్ సిల్వర్ రంగుల్లో భారత్ మార్కెట్ లో అందుబాటులో ఉంది.

రూ.2000 ధర తగ్గింపు :
ఈ వన్‌ప్లస్ 5G ఫోన్ గత సంవత్సరం జూన్‌లో విడుదల అయింది. విడుదల సమయంలో 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. ప్రస్తుతం ఈ రెండు ఫోన్‌లను వరుసగా రూ.17,998, రూ.20,998 ధరలకు సొంతం చేసుకోవచ్చు.
అదనపు డిస్కౌంట్‌లు :
దీంతోపాటు ICICI, వన్‌కార్డు, RBL బ్యాంకుల క్రెడిట్ కార్డులపై గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే విడుదల ధరతో పోలిస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు EMI ఆప్షన్‌లోనూ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
ఈ వన్‌ప్లస్ హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల (1080*2400 పిక్సల్స్) FHD+ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 2100 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
50MP OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరాలను అమర్చారు. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్ సపోర్టును కలిగి ఉంది. ముందువైపు ఈ ఫోన్ 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ Adreno 619 GPU మరియు 8GB LPDDR4X, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్ లను పొందనుంది.
మెరుగైన బ్యాటరీ స్పెసిఫికేషన్లు :
ఈ ఫోన్ 80W వైర్ SUPERVOOC ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. 5G, బ్లూటూత్ 5.1, Wi-Fi 5, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications







