5500mAh బ్యాటరీ, ఆక్వా టచ్ ఫీచర్‌తో వన్‌ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వెల్లడి..స్పెసిఫికేషన్‌ల వివరాలు!
వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వెల్లడైంది. వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ (OnePlus Nord CE 4 lite 5G Smartphone Launch Date) 24వ తేదీ సాయంత్రం 7 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేసింది. దీంతోపాటు కొన్ని స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ గత మోడల్ కంటే మెరుగైన ఫొటోగ్రఫీ సామర్థ్యాలు మరియు భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది. బడ్జెట్ ధరలో మెరుగైన డిస్‌ప్లే క్వాలిటీ, ఫ్లాగ్‌షిప్ మోడల్ తరహా బ్యాటరీ పనితీరు, ఛార్జింగ్ వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ఫోటోను కూడా విడుదల చేసింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. చిన్న కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంది. బ్లూ కలర్‌లో స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకొంది. విడుదల తేదీతోపాటు సంస్థ ఈ హ్యాండ్‌సెట్ గురించి కొన్ని వివరాలను వెల్లడించింది.

సంస్థ వెల్లడించిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 120Hz అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 2100 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో లాంచ్ కానుంది. దీంతోపాటు సంస్థ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. వన్‌ప్లస్ 12R తరహా ఫీచర్‌ను కలిగి ఉంది. అదే ఆక్వా టచ్ (Aqua Touch).. అంటే తడి చేతులతోనూ ఫోన్ టచ్ స్క్రీన్‌ను నియంత్రించవచ్చు.
దీంతోపాటు ఛార్జింగ్ వివరాలను కూడా సంస్థ వెల్లడించింది. గత మోడల్ కంటే భారీ బ్యాటరీతో లాంచ్ చేయనుంది. ఈ నార్డ్ CE 4 లైట్ హ్యాండ్‌సెట్ 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని వన్‌ప్లస్ వెల్లడించింది. దీంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ పైన ప్రకటన చేసింది.
ఇప్పటికే వచ్చిన కొన్ని లీక్‌ల ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP OIS సోనీ LYTIA ప్రధాన కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. మరో కెమెరా వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.
ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ సహా ఇతర వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ రూ.20,000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ సహా అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications