Home
Mobile

వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్.. 50MP సోనీ కెమెరా, 5500mAh బ్యాటరీ..!

వన్‌ప్లస్‌ నుంచి ఇటీవల వన్‌ప్లస్‌ నార్డ్ 5 సిరీస్‌ భారత్‌ మార్కెట్‌ లో లాంచ్‌ అయింది. ఇందులో నార్డ్‌ 5, నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. CE 5 స్మార్ట్‌ఫోన్ 7100mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో తొలి భారీ బ్యాటరీ వన్‌ప్లస్‌ ఫోన్‌గా నిలిచింది. అయితే గత సంవత్సరం విడుదల అయిన వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ ను (OnePlus Nord CE 4 Lite 5G Smartphone) డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

విడుదల సమయంలో వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.19,999, 8GB + 256GB స్టోరేజీ ధర రూ.22,999 గా ఉండేది. అమెజాన్ లో ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

OnePlus Nord CE 4 Lite 5G Smartphone telugu news

రూ.3 వేల ధర తగ్గింపు :
అమెజాన్‌లో 8GB/128GB వేరియంట్‌ ను రూ.16,998 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.3 వేల డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ లో ఈ ఫోన్‌ టాప్ వేరియంట్ అందుబాటులో లేదు. అయితే వన్‌ప్లస్‌ ఇండియా వెబ్‌సైట్‌ లో ఈ ఫోన్‌ తాత్కాలికంగా అందుబాటులో లేదు.

మూడు కలర్‌ వేరియంట్స్ :
వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ మెగా బ్లూ, సూపర్‌ సిల్వర్, అల్ట్రా ఆరెంజ్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

స్నాప్‌డ్రాగన్, ఆండ్రాయిడ్ 14 OS :
ఈ వన్‌ప్లస్‌ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 695 SoC ప్రాసెసర్‌ పైన పనిచేస్తోంది. Adreno 619 GPU ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4x ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 పైన పనిచేస్తోంది.

OnePlus Nord CE 4 Lite 5G Smartphone telugu news

50MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ను కలిగి ఉంది.

5500mAh భారీ బ్యాటరీ :
వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 80W వైర్ SUPERVOOC ఛార్జింగ్‌, 5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై 5, బ్లూటూత్‌ 5.1, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP54 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord CE 4 Lite 5G Smartphone now available at rs16998 price on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X