Home
Mobile

వ‌న్‌ప్లస్‌ నుంచి కొత్త ఫోన్‌.. 50MP కెమెరా, 6.67 అంగుళాల డిస్‌ప్లే వంటి స్పెసిఫికేషన్లతో త్వరలో లాంచ్..!

వన్‌ప్లస్‌ నుంచి త్వరలో మరో హ్యాండ్‌సెట్‌ విడుదల కానుందని తెలుస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌ (Oneplus Nord CE 4 lite 5G) పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఇటీవలే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ (BIS) సర్టిఫికేషన్‌ను పొందింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌కు తర్వాత తరం హ్యాండ్‌సెట్‌గా CE 4 లైట్‌ రానుందని తెలుస్తోంది.

వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 లైట్ లిస్టింగ్‌ (Oneplus Upcoming Smartphones 2024) సమాచారాన్ని టిప్‌స్టర్ సంజూ తన X పోస్టు ద్వారా వివరించారు. CPH2619 మోడల్ నంబర్‌తో కనిపించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఒప్పో A3 కి రీబ్రాండెడ్‌ గా వస్తుందని తెలుస్తోంది. దీని ధర రూ.20,000 కంటే తక్కువగా ఉంటుందని తెలిపారు.

Oneplus Nord CE 4 lite 5G smartphone news

ఇప్పటికే విడుదలైన అంచనాలు సహా టిప్‌స్టర్‌ నివేదికల ప్రకారం వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది.

50MP, 16MP సెల్ఫీ కెమెరా! :
50MP ప్రైమరీ కెమెరా సహా మరియు 2MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాతో లాంచ్‌ కానుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

త్వరలో భారత్‌లో లాంచ్‌ కానుందని భావిస్తున్న వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 SoC పైన పనిచేస్తుంది. టిప్‌స్టర్‌ వివరాల ఆధారంగా రూ.20,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ వివరాలను వన్‌ప్లస్‌ ధ్రువీకరించలేదు.

* ప్రస్తుతం అందుబాటులో ఉన్న వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.72 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 2400*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌ సహా 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌తో లాంచ్ అయింది. డార్క్‌ మోడ్‌ సహా Eye Comfort వంటి ఫీచర్లను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OxygenOS పైన పనిచేస్తోంది. క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్‌ 695 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం అడెన్నో 619 తో జతచేయబడుతుంది. 67W సూపర్‌వోక్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus Nord CE 4 lite 5G smartphone spotted on BIS certification website
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X