Home
Mobile

50MP కెమెరా, 5500mAh బ్యాటరీ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ పై రూ.3000 డిస్కౌంట్‌.. సేల్‌ వివరాలు..!

పండుగల సీజన్ సందర్భంగా ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలు సహా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు భారీగా డిస్కౌంట్‌లను ప్రకటన చేస్తున్నాయి. వన్‌ప్లస్‌ సంస్థ తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌లు సహా మిడ్‌రేంజ్‌, ఇతర హ్యాండ్‌సెట్‌లపై డిస్కౌంట్‌ ధరలను ప్రకటించింది. అయితే వన్‌ప్లస్ దీపావళి సేల్‌ (Oneplus Diwali sale 2024) సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం కాగా.. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్ (Amazon Great indian Festival Sale 2024) సెప్టెంబర్‌ 27 నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు సెప్టెంబర్‌ 26 నుంచే సేల్‌ ప్రారంభం కానుంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను (Oneplus Nord CE 4 Lite 5G Smartphone) ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.19,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. మరియు కూపన్‌ కోడ్‌ ద్వారా రూ.1000 అదనపు తగ్గింపును పొందవచ్చు.

oneplus diwali sale offer best price deal on Nord CE 4 lite 5G Smartphone

ఈ ఆఫర్‌ వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్ (Oneplus.in), అమెజాన్‌, రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా సహా ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 26 నుంచి ఈ ఆఫర్‌ ప్రారంభం కానుంది. దీంతోపాటు Oneplus Bullets Wireless Z2 ఇయర్‌ఫోన్స్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.16,999 కే సొంతం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2400 పిక్సల్‌ రిజల్యూషన్‌, 2100 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 20:9 ఆస్పెక్ట్‌ రేషియోను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 695 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్‌ Adreno 619 GPU, 8GB LPDDR4x, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 తో పనిచేస్తుంది. 2 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చని వన్‌ప్లస్‌ చెబుతోంది.

ఈ వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 80W వైర్‌ Supervooc ఛార్జింగ్, 5W రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విభాగం పరంగా డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT-600 కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 5G, W-Fi 5, బ్లూటూత్‌ 5.1, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు IP54 రేటింగ్‌తో ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను అమర్చి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Oneplus Nord CE 4 lite 5G Smartphone to get huge discount on oneplus diwali sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X