వన్‌ప్లస్ నుంచి కొత్త హ్యాండ్‌సెట్.. 50MP కెమెరా, 6.67 అంగుళాల FHD+ డిస్‌ప్లే సహా కీలక స్పెసిఫికేషన్లు..!!
వన్‌ప్లస్ నుంచి త్వరలో భారత్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ హ్యాండ్‌సెట్ (Oneplus Nord CE 4 Lite Smartphone) విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీంతోపాటు గీక్‌బెంచ్ వెబ్‌సైట్ లోనూ కనిపించింది.
అయితే ఈ హ్యాండ్‌సెట్ గురించి ఎటువంటి వివరాలను వన్‌ప్లస్ సంస్థ వెల్లడించలేదు. కొన్ని నివేదికల ఆధారంగా ఈ వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. హ్యాండ్‌సెట్ 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Oxygen OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ ను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్ మరియు 128GB లేదా 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో విడుదల కానుందని తెలుస్తోంది.
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా మరియు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 16MP కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.
భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ ఇన్ డిస్‌ప్లే స్కానర్‌ను కలిగి ఉంటుంది. ఈ వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ రూ.20,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై వన్‌ప్లస్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
** వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ 2412*1080 పిక్సల్ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 210 టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్‌తో విడుదల అయింది. మరియు ఈ డిస్‌ప్లే HDR 10+ కలర్ సర్టిఫికేషన్ మరియు 10 బిట్ కలర్ డెప్త్‌ను కలిగి ఉంటుంది.
ఈ వన్‌ప్లస్ కొత్త హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ LYT600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో వచ్చింది. మరియు 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.
ఈ వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్ గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం అడెన్నో 720 GPU తో జతచేయబడి ఉంటుంది. మరియు 8GB LDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంటుంది.
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. దీంతోపాటు 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సంస్థ ప్రకారం కేవలం 29 నిమిషాల్లో 0-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








