Home
Mobile

వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. విడుదల తేదీ ఖరారు.. స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు..!

వన్‌ప్లస్‌ నుంచి త్వరలో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కానుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌ స్మార్ట్‌ ఫోన్‌ను (OnePlus Nord CE 4 Lite Smartphone) జూన్‌ 18న భారత్‌లో విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. దీంతోపాటు అమెజాన్ లైవ్‌ పేజీ కూడా విడుదలను ధ్రువీకరించింది. అయితే వన్‌ ప్లస్‌ తన X ఫోస్ట్‌లో ఏ స్మార్ట్‌ ఫోన్‌ ను విడుదల చేస్తుందనే విషయాన్ని వెల్లడించలేదు. అమెజాన్ మాత్రం నార్డ్‌ CE 4 లైట్‌ హ్యాండ్‌ సెట్‌ విడుదల కానున్నట్లు తెలిపింది.

జూన్ 18 సాయంత్రం 7 గంటలకు వన్‌ ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కానుంది. అనంతరం అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మెగా బ్లూ కలర్‌ సహా మరిన్ని రంగుల్లో లభించనుందని తెలుస్తోంది. అయితే వన్‌ప్లస్‌ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.

Oneplus Nord CE 4 lite smartphone confirmed to launch on june 18 in india

వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ వన్‌ ప్లస్‌ (OnePlus Upcoming Smartphone) హ్యాండ్‌ సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. స్నాప్‌ డ్రాగన్ 6 జెన్‌ 1 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. రెండు OS అప్‌డేట్లు మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌ డేట్‌లను పొందవచ్చని తెలుస్తోంది.

ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌ స్మార్ట్‌ ఫోన్‌ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ వన్‌ ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌ స్మార్ట్‌ ఫోన్‌ రూ.20,000 కంటే తక్కువ ధరకే భారత్‌ మార్కెట్‌ లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు వచ్చే నెలలో వన్‌ప్లస్‌ నార్డ్ 4 స్మార్ట్‌ ఫోన్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై వన్‌ ప్లస్‌ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటి కప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus Nord CE 4 lite smartphone launch confirmed in india specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X