Home
Mobile

వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ ఆఫర్‌.. ఈ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ ప్లస్‌ నార్డ్‌ CE 4 హ్యాండ్‌ సెట్‌ను (Oneplus Nord CE 4 Smartphone Sale offers) అమెజాన్‌ లో తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ప్రస్తుతం ఈ హ్యాండ్‌ సెట్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ.24,999 గా ఉంది. బ్యాంకు కార్డుల ద్వారా రూ.2000 వరకు తగ్గింపు ధరను పొందనుండగా.. వివిధ కార్డులపై డిస్కౌంట్‌లలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.24,999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది. HDFC EMI రూపంలో కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. అదే ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు, BOB, IDFC ఫస్ట్‌ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసినా రూ.2000 తగ్గింపును పొందవచ్చు.

Oneplus nord CE 4 Smartphone

వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2412*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌ మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్, 210 టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 2160Hz PWM డిమ్మింగ్‌తో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే HDR 10+ కలర్‌ సర్టిఫికేషన్‌ మరియు 10 బిట్‌ కలర్‌ డెప్త్‌ను కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OxygenOS ను కలిగి ఉంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ Adreno 720 GPU తో జతచేయబడి ఉంటుంది. మరియు 8GB LDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W SUPERVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కేవలం 29 నిమిషాల్లోనే 0-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని సంస్థ హామీ ఇచ్చింది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్‌ 5.4, డ్యూయల్‌ బాండ్‌ వైఫై, GPS వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus nord CE 4 Smartphone gets discount price on amazon with bank cards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X