వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్... 50MP సోనీ కెమెరా, 6.7 అంగుళాల డిస్‌ప్లే సహా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో వన్‌ప్లస్ నార్డ్ CE 4 హ్యాండ్‌సెట్‌ను (Oneplus Nord CE 4 Smartphone) విడుదల చేసింది. మెరుగైన ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లతో అందుబాటులోకి వచ్చింది. లాంచ్ సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.24,999 గా ఉండగా.. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లతో డిస్కౌంట్ ధరను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP సోనీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర విడుదల సమయంలో రూ.24,999 గా ఉండేది. ఐసీఐసీఐ బ్యాంకు లేదా వన్‌కార్డ్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.3000 డిస్కౌంట్ పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.21999 కే సొంతం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2412*1080 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 210 టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్‌తో అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మరియు గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం Adreno 720 GPU చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 8GB LPDDR4x ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేయబడుతుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 50MP సోనీ LYT-600 ప్రధాన కెమెరా, 8MP సోనీ IMX-355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాతో అందుబాటులో ఉంది. వెనుక కెమెరాల నుంచి 30fps తో 4K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. ముందు కెమెరా ద్వారా 30fps తో 1080p వీడియోలను రికార్డు చేయవచ్చు.
ఈ వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ 100W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 29 నిమిషాల్లో 0-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చని సంస్థ చెబుతోంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు సహా IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








