Home
Mobile

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ ఖరారు.. మూడు కెమెరాలు సహా 6.7 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్‌..?

వన్‌ప్లస్‌ సంస్థ త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. తన వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్‌ను (OnePlus Nord CE 4 Launch date) ఏప్రిల్‌ 1వ తేదీన విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ ఫోటోను విడుదల చేసింది. గత మోడళ్ల కంటే ఈ ఫోన్‌ డిజైన్ ఆకట్టుకుంటుంది.

ఈ ఫోటో ఆధారంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ (OnePlus Nord CE 4 Smartphone Glimpse) వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు వన్‌ప్లస్‌ లోగోను వెనుకవైపు గుర్తించవచ్చు. ఈ ఫోన్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా టీవీ, ఏసీ సహా ఇతర కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను నియంత్రించవచ్చు.

OnePlus Nord CE 4 Smartphone launch date in india

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను పైన పనిచేస్తుందని వన్‌ప్లస్‌ సంస్థ ధ్రువీకరించింది. ఈ హ్యాండ్‌సెట్‌ 15 శాతం మెరుగైన CPU మరియు 50 శాతం 50 శాతం మెరుగైన GPU పనితీరును కనబరుస్తుందని తెలిపింది.

ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ డార్క్‌ క్రోమ్‌ మరియు సెలాడాన్‌ మార్బుల్‌ రంగుల్లో లభిస్తుందని వన్‌ప్లస్‌ తెలిపింది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్ 1న విడుదల కానుండగా.. వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌ OnePlus.in మరియు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చని సంస్థ వెల్లడించింది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు : వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్‌ 50MP ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుందని సమాచారం. ఈ వివరాలపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

** వన్‌ప్లస్‌ నుంచి ఇటీవల వన్‌ప్లస్‌ 12 మరియు 12R సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ 1264*2780 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల అమోలెడ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణను పొందుతుంది.

ఈ 12R స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్‌ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. 12GB లేదా 16GB LPDDR5x ర్యామ్‌ మరియు అడెన్నో 740 GPU తో జతచేయబడుతుంది. UFS 4.0 టెక్నాలజీతో గరిష్ఠంగా 1TB స్టోరేజీని కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ 100W సూపర్‌వోక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో కూడిన 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, f/2.4 లెన్స్‌తో కూడిన 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌.. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్‌+ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.39,999గా ఉంది. అదే 16GB ర్యామ్‌+ 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.45,999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord CE 4 Smartphone launch confirmed in india with snapdragon chipset
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X