Home
Mobile

5,500mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లేతో OnePlus స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. 29 నిమిషాల్లోనే 100% ఛార్జింగ్‌..!!

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్‌లో (Oneplus Nord CE 4 Smartphone launched) విడుదల అయింది. మిడ్‌ రేంజ్‌ ధరలో ఈ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసింది. స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌ సహా 6.7 అంగుళాల డిస్‌ప్లే సహా కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ సహా ఇతర ఆఫర్ల వివరాలను కూడా వెల్లడించింది.

వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ 2412*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్, 210 టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 2160Hz PWM డిమ్మింగ్‌తో విడుదల అయింది. మరియు ఈ డిస్‌ప్లే HDR 10+ కలర్‌ సర్టిఫికేషన్‌ మరియు 10 బిట్‌ కలర్‌ డెప్త్‌ను కలిగి ఉంటుంది.

Oneplus Nord CE 4 Smartphone launched

ఈ వన్‌ప్లస్‌ కొత్త హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ LYT600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో వచ్చింది. మరియు 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక కెమెరాల నుంచి 30fps తో 4K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. అదే ముందు కెమెరా ద్వారా 30fps తో 1080p వీడియోలను రికార్డు చేయవచ్చు. కెమెరా విభాగం పరంగా మెరుగైన, నాణ్యమైన ఫోటోలను, వీడియోలను క్యాప్చర్‌ చేయవచ్చు.

Oneplus Nord CE 4 Smartphone launched

ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌ గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం అడెన్నో 720 GPU తో జతచేయబడి ఉంటుంది. మరియు 8GB LDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. దీంతోపాటు 100W SUPERVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సంస్థ ప్రకారం కేవలం 29 నిమిషాల్లో 0-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చని తెలుస్తోంది.

కనెక్టివిటీ పరంగా ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ 5G సిమ్‌ను సపోర్టు చేస్తుంది. మరియు బ్లూటూత్‌ 5.4, డ్యూయల్‌ బాండ్‌ వైఫై, GPSని కలిగి ఉంటుంది. దీంతోపాటు IP54 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెన్స్‌తో వస్తుంది. దీంతోపాటు డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌ ఏప్రిల్‌ 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలుకు అందుబాటులో (Oneplus Nord CE 4 Sale) ఉంటుంది. 128GB ర్యా్మ్‌ ధర రూ.24,999గా ఉంది. అదే 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.26,999 గా ఉంది. సేల్ ప్రారంభం అయిన రోజు కొనుగోలు చేసిన వారు రూ.2199 విలువైన వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2rను ఉచితంగా పొందవచ్చు.

మరియు ఎక్స్చేంజ్ బోనస్‌ కింద రూ.2500 ప్రయోజనాలు పొందవచ్చు. అదే ఏప్రిల్‌ 5 నుంచి కొనుగోలు చేసే వారు ఎక్స్చంజీ ద్వారా రూ.2500 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మరియు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Oneplus Nord CE 4 Smartphone launched in india with 100W supervooc charging support
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X