Home
Mobile

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 ధరల వివరాలు లీక్‌.. గత మోడల్‌ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!

వన్‌ప్లస్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 (OnePlus Nord CE 4 Price leaked) ఏప్రిల్‌ 1వ తేదీన భారత్‌లో లాంచ్‌ కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. తాజాగా ఈ ఫోన్‌ ధరలను టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ లీక్‌ చేశారు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుందని అభిషేక్‌ యాదవ్‌ తెలిపారు. దీంతోపాటు వీటి ధరలను లీక్‌ చేశారు. 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంటుందని తెలిపారు. అదే 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. అయితే ఈ ధరలపై సంస్థ స్పందించలేదు.

OnePlus Nord CE 4 Smartphone

6.7 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌ :
అయితే ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ ఫోన్‌ 6.7 అంగుళాల ఫ్యూయడ్‌ అమోలెడ్ ను కలిగి ఉంటుంది.

120Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా స్క్రీన్‌ టూ బాడీ రేడియో 93.4 శాతం కలిగి ఉంటుంది. ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ కొత్త వెర్షన్‌ ఆక్టాకోర్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది.

29 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్‌ :
ఈ ఫోన్‌ 8GB LPDDR4X ర్యామ్ గలిగి ఉంటుంది. వర్చువల్‌గా ర్యామ్‌ను పెంచుకొనే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్‌ గరిష్ఠంగా 256GB అంతర్గత స్టోరేజీతో రానుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ 100W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది. కేవలం 29 నిమిషాల్లోనే 1-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చని సంస్థ వెల్లడించింది.

5500mAh బ్యాటరీ సామర్థ్యం! :
ఇప్పటికే వచ్చిన లీక్‌ల ఆధారంగా త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్‌ కొత్త హ్యాండ్‌సెట్‌ 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు వెనుకవైపు 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉండనుందని తెలుస్తోంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది.

మరియు 8MP సోనీ IMX355 అల్ట్రా వైడ్‌ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధరలపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. విడుదల రోజుల పూర్తి స్పష్టత రానుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Nord CE 4 Smartphone price leaked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X