Home
Mobile

100W SuperVOOC ఛార్జింగ్‌, ఆండ్రాయిడ్‌ 14 OS తో వన్‌ప్లస్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్‌, సేల్‌ వివరాలు..!

వన్‌ప్లస్‌ సంస్థ నుంచి భారత్ మార్కెట్‌లోకి ఏప్రిల్‌ 1వ తేదీన వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ (Oneplus Nord CE 4 Smartphone) విడుదల కానుంది. అయితే అధికారిక విడుదలకు ముందే వన్‌ప్లస్‌ సంస్థ ఈ హ్యాండ్‌కు సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించింది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్‌ CPH2613 తో కనిపించింది.

వన్‌ప్లస్‌ ఇండియా ల్యాండింగ్‌ పేజీ ఆధారంగా ఈ వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్ల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోన్‌ 100W SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో ఒకరోజుపాటు బ్యాటరీ బ్యాకప్‌ వస్తుందని సంస్థ పేర్కొంది.

Oneplus Nord CE 4 Smartphone

ఇటీవల గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ CPH2613 మోడల్‌ నంబర్‌తో (Oneplus Nord CE 4 Spotted on Geekbench) కనిపించింది. ఈ లిస్టింగ్‌ ద్వారా ఈ వన్‌ప్లస్‌ కొత్త హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 3 SOC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్‌ సంస్థ నార్డ్‌ CE 4 వివరాలను వెల్లడించింది. స్నాప్‌ డ్రాగన్ చిప్‌సె్‌ 8GB ర్యామ్‌ మరియు 256GB వరకు అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుందని తెలిపింది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని 1TB వరకు పెంచుకొనే వీలుంది. అదే 16GB వరకు ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్‌ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు విడుదల కానుంది. అనంతరం అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Oneplus Nord CE 4 Smartphone

రెండు రోజుల క్రితం వన్‌ప్లస్‌ కొత్తఫోన్ ఫోటోను విడుదల చేసింది. వన్‌ప్లస్‌ సంస్థ నార్డ్‌ CE 4 ఫోన్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా టీవీ, ఏసీ సహా ఇతర కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను నియంత్రించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ డార్క్‌ క్రోమ్‌ మరియు సెలాడాన్‌ రంగుల్లో లభిస్తుందని వన్‌ప్లస్‌ తెలిపింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుందని సమాచారం. ఈ వివరాలపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Oneplus Nord CE 4 Smartphone

* వన్‌ప్లస్‌ సంస్థ భారత్‌ మార్కెట్‌లో టీవీలు, మానిటర్ల ఉత్పత్తి, విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వన్‌ప్లస్‌ ఇండియా వెబ్‌సైట్‌ నుంచి టీవీలు, డిస్‌ప్లే కేటరిగీని తీసివేసింది. వ్యాపార వ్యూహాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ భారత్‌ మార్కెట్‌లోకి 2019 లో తొలిసారిగా వన్‌ప్లస్‌ TV Q1 ద్వారా ఈ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది.

అప్పటి నుంచి వివిధ రకాల ధరల్లో అనేక టీవీలు, స్మార్ట్‌టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్‌ప్లస్ మానిటర్ల విభాగంలో రెండు మోడళ్లను మాత్రమే కలిగి ఉంది. అవి వన్‌ప్లస్‌ X27 అంగుళాలు మరియు వన్‌ప్లస్ E 24 అంగుళాలు మోడళ్లను మాత్రమే విడుదల చేసింది. అయితే ప్రస్తుతం వన్‌ప్లస్‌ బ్రాండ్‌ భారత్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు ప్రసిద్ధి చెందింది. ఈ సంవత్సరంలో ఈ బ్రాండ్‌ నుంచి వన్‌ప్లస్ 12 సిరీస్‌ అందుబాటులోకి వచ్చింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus Nord CE 4 Smartphone spotted on Geekbench here are the confirmed specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X