Home
Mobile

7100mAh భారీ బ్యాటరీ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ ఫోటో లీక్‌.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!

వన్‌ప్లస్‌ నుంచి త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌ (OnePlus Nord CE 5 Smartphone) విడుదల కానుంది. ఈ ఫోన్‌ 7100mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. Smartprix ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే భారత్ లో భారీ బ్యాటరీ ఫోన్‌లు క్యూ కడుతున్నాయి. 7300mAh భారీ బ్యాటరీతో ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే లాంచ్‌ అయింది. ఇవాళ్టి నుంచే సేల్‌ ప్రారంభం కానుంది.

ఇప్పటికే ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లు విడుదలకు సిద్ధం :
ఒప్పో K13 5G ఫోన్‌ కూడా 7000mAh బ్యాటరీతో లాంచ్‌ కానుంది. వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా 7300mAh బ్యాటరీతో ఏప్రిల్ 22 న లాంచ్‌ కానుంది. భారీ బ్యాటరీ ట్రెండ్‌ నడుస్తున్న భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

Oneplus nord CE 5 Smartphone expected to feature 7100mAh battery design leaked in india

డిజైన్ వివరాలు లీక్‌ :
అయితే తాజాగా ఈ వన్‌ప్లస్‌ ఫోన్‌ డిజైన్‌ కూడా లీక్‌ అయింది. స్మార్ట్‌ప్రిక్స్ ద్వారా వివరాలు వెల్లడయ్యాయి. దీని ఆధారంగా కెమెరా మాడ్యూల్‌లో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మే నెలలో ఈ ఫోన్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది.

లీక్‌ అయిన ఫోటో ఆధారంగా కర్వడ్‌ ఎడ్జ్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు ఒవెల్‌ ఆకారాన్ని కలిగి ఉంది. ధర విషయానికి వస్తే రూ.25,000 సెగ్మెంట్‌లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Oneplus nord CE 5 Smartphone expected to feature 7100mAh battery design leaked in india

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 ఫోన్‌ అంచనా వివరాలు :
గతంలో లీక్‌ అయిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం.

సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ :
ఈ ఫోన్‌ భారీ బ్యాటరీతో అందుబాటులోకి వస్తున్నా.. స్లిమ్‌ డిజైన్‌నే కలిగి ఉంటుందని తెలుస్తోంది. సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీతో విడుదల కానుందని తెలుస్తోంది. కెమెరా విభాగం పరంగా డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కెమెరా ఫీచర్‌లు :
ఇందులో (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) 50MP సోనీ LYT 600 లేదా IMX882 కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా తోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ ఫోన్ రూ.25 వేల ధర సెగ్మెంట్‌లో మే నెలలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. భారీ బ్యాటరీలో ఫోన్‌లు లాంచ్ అవుతున్నా.. తక్కువ థిక్‌నెస్‌తో కూడిన డిజైన్‌ను కలిగి ఉంటున్నాయి. వన్‌ప్లస్‌ నార్డ్ CE 5 కూడా స్లిమ్ డిజైన్‌ తోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

Photo Credit : Smartprix

Best Mobiles in India

English summary
Oneplus nord CE 5 Smartphone expected to feature 7100mAh battery design leaked in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X