Home
Mobile

7100mAh భారీ బ్యాటరీతో వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్.. చిప్‌సెట్‌, ఇతర ఫీచర్‌ల వివరాలు..!

భారత్‌ మార్కెట్‌ లో ఇటీవల భారీ బ్యాటరీ ఫోన్‌లు లాంచ్‌ అవుతున్నాయి. ఇటీవలే ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా 7300mAh బ్యాటరీతో లాంచ్‌ అయింది. వివో కూడా T4 5G మోడల్‌ లో 7300mAh బ్యాటరీతో విడుదల చేయనున్నట్లు తెలిసింది. అయితే మరో ప్రముఖ సంస్థ వన్‌ప్లస్‌ కూడా భారీ బ్యాటరీతో మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌ లో స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా వన్‌ప్లస్ హ్యాండ్‌సెట్‌ గురించి అనేక వివరాలు లీక్‌ అయ్యాయి.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌ (OnePlus Nord CE 5 Smartphone) త్వరలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌ కు సంబంధించిన కీలక వివరాలు తాజాగా లీక్‌ అయ్యాయి. ఇందులో బ్యాటరీ, చిప్‌సెట్‌తోపాటు మరిన్ని వివరాలు ఉన్నాయి. గత సంవత్సరం లాంచ్‌ అయిన వన్‌ప్లస్ నార్డ్‌ CE 4 మోడల్‌ కు తర్వాత తరం హ్యాండ్‌సెట్‌గా విడుదల కానుందని తెలుస్తోంది.

Oneplus Nord CE 5 Smartphone

Smartprix రిపోర్టు ఆధారంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌ 7100mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ సెగ్మెంట్‌లోనే బెస్ట్‌ బ్యాటరీ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 SoC చిప్‌సెట్‌ లేదా మీడియాటెక్‌ డైమెన్సిటీ 8400 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ చిప్‌సెట్‌ UFS 3.1 వెర్షన్‌ గా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్‌ ఎప్పుడు విడుదల కానుందనే సమాచారం ప్రస్తుతం అందుబాటులోకి లేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వన్‌ప్లస్‌ నార్డ్‌ CE4 5G ఫోన్‌ గత సంవత్సరం ఏప్రిల్‌లో లాంచ్‌ అయింది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ :
వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఆక్వా టచ్‌ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

గత సంవత్సరం లాంచ్‌ అయిన ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ Adreno 720 GPU తో జతచేసి ఉంది. ఈ చిప్ గరిష్ఠంగా 8GB LPDDR4X ర్యామ్‌ మరియు 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OxygenOS 14 ను కలిగి ఉంది.

ఈ వన్‌ప్లస్‌ ఫోన్‌ 50MP సోనీ LYT 600 (OIS) ప్రైమరీ కెమెరా, 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. మరియు 100W Supervooc ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus Nord CE 5 Smartphone Tipped to launch soon with 7100mAh large battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X