Home
Mobile

రూ.25 వేల ధర రేంజ్‌లో 7100mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరాతో వన్‌ప్లస్‌ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌!

వన్‌ప్లస్ నుంచి ఇటీవల వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్‌, వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. 2025 సంవత్సరం జులైలో వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. భారీ బ్యాటరీతోపాటు అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ రూ.25 వేల ధర సెగ్మెంట్‌ లో బెస్ట్ హ్యాండ్‌సెట్‌గా ఉంది. ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను అందిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌ (Oneplus Nord CE 5 Smartphone) ప్రస్తుతం వన్‌ప్లస్‌ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28999 గా ఉంది.

Oneplus nord CE 5 Smartphone sale offer

రూ.1000 డిస్కౌంట్‌ :
వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ ను అందిస్తోంది. అన్ని బ్యాంకుల క్రెడిట్‌ కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ ను అందిస్తోంది. అమెజాన్‌లోనూ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్ బ్లాక్ ఇన్ఫినిటీ, మార్బుల్‌ మిస్ట్‌, నెక్సస్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది.

వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1400 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఆక్వా టచ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

Oneplus nord CE 5 Smartphone sale offer

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
వన్‌ప్లస్ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అపెక్స్‌ చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 80W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 7100mAh బ్యాటరీతో పనిచేస్తోంది. బైపాస్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 6 గంటలపాటు యూట్యూబ్‌ ను వినియోగించుకోవచ్చని చెబుతోంది.

OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ సెన్సర్‌ను ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP సోనీ IMX480 సెల్ఫీ కెమెరాను అమర్చారు. 60fps తో 4K వీడియోలను రికార్డు చేయవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్ కనెక్టివిటీ కోసం 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైఫై 6, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు IR బ్లా్స్టర్‌ ఆప్షన్‌ కూడా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus nord CE 5 Smartphone with 7100mAh battery, 50MP camera under Rs25000 price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X