Home
Mobile

7100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌ అందించే వన్‌ప్లస్‌ 5G ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్‌..!

OnePlus Nord CE 5 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ ఇటీవల వన్‌ప్లస్‌ సమ్మర్‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో వన్‌ప్లస్‌ నార్డ్ 5, వన్‌ప్లస్‌ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ల సేల్‌ కూడా ప్రారంభం అయింది. ఈ రెండు ఫోన్లు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంకు ఆఫర్ కింద రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

రూ.2000 డిస్కౌంట్‌ :
వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24,998, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,998, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28,998 గా ఉంది. అమెజాన్‌లో ఐసీఐసీఐ, యాక్సెస్‌, RBL కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Oneplus Nord CE 5 Smartphone

వన్‌ప్లస్ నార్డ్ CE 5 పూర్తి వివరాలు :
ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల ఫుల్‌ HD అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1400 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అక్వా టచ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మరియు అల్ట్రా HDR ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

6 సంవత్సరాల అప్‌డేట్స్‌ :
వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5 హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అపెక్స్‌ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 12GB LPDDR5x ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 600 కెమెరాను కలిగి ఉంది. 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరియు 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP సోనీ IMX480 కెమెరాను కలిగి ఉంది.

Oneplus Nord CE 5 Smartphone

7100mAh బ్యాటరీ :
ఈ ఫోన్‌ AI Best Face, AI Eraser వంటి ఎడిటింగ్‌ ఫీచర్లను కలిగి ఉంది. AI కాల్‌ అసిస్టెంట్‌, AI వాయిస్‌ స్క్రైబ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీంతోపాటు ఈ వన్‌ప్లస్‌ హ్యాండ్‌సెట్‌ 80W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 7100mAh బ్యాటరీతో పనిచేస్తుంది. బైపాస్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్‌ 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, Wi-Fi 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు IR బ్లాస్టర్‌ను కూడా కలిగి ఉంది. నెక్సస్‌ బ్లూ, మార్బుల్‌ మిస్ట్‌, బ్లాస్‌ ఇన్ఫినిటీ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus Nord CE 5 Smartphone with 7100mAh battery gets Rs2000 discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X