Home
Mobile

7100mAh భారీ బ్యాటరీతో OnePlus 5G ఫోన్‌ .. రూ.2000 డిస్కౌంట్‌లో ఇవాళ్టి నుంచే కొనుగోలు చేయవచ్చు..!

OnePlus Nord CE 5 Smartphone Sale : వన్‌ప్లస్‌ ఇటీవల నిర్వహించిన సమ్మర్‌ లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్‌ నార్డ్ 5, వన్‌ప్లస్‌ నార్డ్ CE 5, వన్‌ప్లస్‌ బడ్స్ 4 విడుదల అయ్యాయి. జులై 9 వ తేదీ నుంచే నార్డ్ 5 ఫోన్ సేల్‌ ప్రారంభం అయింది. ఇవాళ్టి నుంచి వన్‌ప్లస్‌ నార్డ్ CE 5, బడ్స్ 4 కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. వన్‌ప్లస్‌ నార్డ్ CE 5 హ్యాండ్‌సెట్‌ ఏకంగా 7100mAh బ్యాటరీతో పనిచేస్తుంది. డిజైన్ సహా ఫీచర్ల పరంగా ఈ ఫోన్ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

రూ.2000 డిస్కౌంట్ :
వన్‌ప్లస్ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28999 గా ఉంది. వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌, అమెజాన్, ఇతర భాగస్వామ్య స్టోర్స్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Oneplus Nord CE 5 Smartphone with 7100mAh Battery now available for sale in india from today1

తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.22999 కే సొంతం చేసుకోవచ్చు. నెక్సస్‌ బ్లూ, మార్బుల్‌ మిస్ట్‌, బ్లాస్‌ ఇన్ఫినిటీ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

డిస్‌ప్లే వివరాలు :
వన్‌ప్లస్ నార్డ్‌ CE 5 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 1400 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అపెక్స్‌ చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పైన పనిచేస్తుంది.

Oneplus Nord CE 5 Smartphone with 7100mAh Battery now available for sale in india from today1

సోనీ కెమెరా, భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 600 కెమెరా, 8MP OVO8D10 అల్ట్రావైడ్‌ లెన్స్‌, 16MP సోనీ IMX480 సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. 80W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 7100mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ వన్‌ప్లస్ నార్డ్‌ CE 5 ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, IR బ్లాస్టర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా WiFi 6, బ్లూటూత్‌ 5.4 కలిగి ఉంది.

* వన్‌ప్లస్‌ బడ్స్‌ 4 ను ఇవాళ్టి నుంచి కొనుగోలు చేయవచ్చు. ధర రూ.5999 గా ఉంది. రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ ఇండియా ఇ-స్టోర్‌, వన్‌ప్లస్‌ స్టోర్‌ యాప్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్, మింత్రా, రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా, విజయ్‌ సేల్స్‌, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్ సహా ఇతర రిటైల్‌ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్‌ బడ్స్‌ 4.. 47ms అల్ట్రా లో లేటెన్సీ ను సపోర్టు చేస్తుంది. 55dB అడాప్టివ్‌ ANC ఫీచర్‌ను కలిగి ఉంది. IP55 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. బ్లూటూత్ 5.4, డ్యూయల్‌ డివైజ్‌ కనెక్టివిటీ మరియు LHDC 5.0 ఆడియో కోడిక్‌ను సపోర్టు చేస్తుంది.

వన్‌ప్లస్‌ బడ్స్ 4 ను సింగిల్‌ ఛార్జింగ్‌తో 45 గంటల ప్లేబ్యాక్‌ టైంను (ANC Off) పొందవచ్చు. కేవలం బడ్స్‌ మాత్రమే 11 గంటల ప్లేటైంను అందిస్తాయని వన్‌ప్లస్‌ చెబుతోంది. 10 నిమిషాల క్లిక్‌ ఛార్జ్‌ సపోర్టుతో 11 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. స్ట్రోమ్‌ గ్రే, జెన్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus Nord CE 5 Smartphone with 7100mAh Battery now available for sale in india from today
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X