7100mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అపెక్స్ చిప్‌సెట్‌తో వన్‌ప్లస్ ఫోన్.. కీలక వివరాలు వెల్లడి
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి వచ్చే వారం వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్, వన్‌ప్లస్ బడ్స్ 4 TWS విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. భారత్‌లో జులై 8 వ తేదీన ఈ ఉత్పత్తులు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్‌లు, బడ్స్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఇటీవల నార్డ్ 5 కీలక స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడి కాగా.. తాజాగా నార్డ్ CE 5 ఫోన్ స్పెసిఫికేషన్‌లను సంస్థ వెల్లడించింది.
మీడియాటెక్ చిప్‌సెట్ :
వన్‌ప్లస్ తాజాగా విడుదల చేసిన వివరాల ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ (OnePlus Nord CE 5 Smartphone) 4nm ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అపెక్స్ చిప్‌సెట్ తో పనిచేస్తుంది. మరియు Mali G615 GPU ను కూడా కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్ LPDDR5X ర్యామ్‌తో జతచేసి ఉంటుంది.

భారీ బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 7100mAh భారీ బ్యాటరీతో లాంచ్ కానుంది. ఇప్పటికే 7000mAh లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో ఇటీవల అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఈ జాబితాలోకి వన్‌ప్లస్ కూడా చేరనుంది. ఈ ఫోన్ 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది.
బ్యాటరీ హెల్త్ కోసం ప్రత్యేక ఫీచర్లు :
ఈ ఛార్జర్‌తో కేవలం 59 నిమిషాల్లోనే 1-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చని వన్‌ప్లస్ తెలిపింది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 6 గంటల వరకు యూట్యూబ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్ బ్యాటరీ హెల్త్ మేజిక్ ఫీచర్‌ను కలిగి ఉంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP 1/1.95 అంగుళాల సోనీ LYT 600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు RAW HDR, రియల్ టోన్ టెక్నాలజీ, అల్ట్రా HDR వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.
వన్‌ప్లస్ బడ్స్ 4 TWS :
ఈ వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలతోపాటు వన్‌ప్లస్ బడ్స్ 4 TWS స్పెసిఫికేషన్‌లను కూడా సంస్థ వెల్లడించింది. ఈ బడ్స్‌ను సింగిల్ ఛార్జింగ్‌తో 45 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని తెలిపింది. కేవలం బడ్స్ మాత్రమే 11 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. ఈ బడ్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ బడ్స్ టచ్ కంట్రోల్స్, గెశ్చర్స్ వంటి కూడా ఉన్నాయి. స్టెడీ కనెక్ట్ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది.
సేల్ వివరాలు :
వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ సేల్ జులై 9 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. అదే నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ జులై 12 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, వన్‌ప్లస్ ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








