OnePlus Nord 6GB ర్యామ్ మోడల్ ఫ్లాష్ సేల్ మరికొద్ది సేపటిలో మొదలుకానున్నది...  

|

ఆన్‌లైన్ ద్వారా గత నెలలో ఇండియాలో మూడు వేరు వేరు వేరియంట్లలో విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ గత వారం నుంచి ఓపెన్ సేల్ ద్వారా అమ్మకానికి రావడం ప్రారంభించింది. అయితే 8GB ర్యామ్ మరియు 12GB ర్యామ్ మోడల్స్ మాత్రమే ఓపెన్ సేల్ లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. అయితే 6GB ర్యామ్ మోడల్ ఇప్పటికీ ఫ్లాష్ సేల్‌లో మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి అమెజాన్ ఇండియా ద్వారా ఇది అందుబాటులోకి రానున్నది. మరోవైపు అమెజాన్ మరియు వన్‌ప్లస్.ఇన్ లభ్యత ప్రకారం 8 జీబీ ర్యామ్ వేరియంట్‌ను, 12 జీబీ ర్యామ్ వేరియంట్‌ను ఓపెన్ సేల్‌లో విక్రయిస్తున్నాయి.

వన్‌ప్లస్ నార్డ్  స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

వన్‌ప్లస్ నార్డ్  స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ను మూడు వేరు వేరు వేరియంట్లలో విడుదల చేసారు. ఈ ఫోన్ యొక్క 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్‌ ఎంట్రీ లెవల్ వేరియంట్ యొక్క ధర రూ.24,999. ఈ వేరియంట్ ఇప్పుడు ప్లాష్ పద్దతిలో అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది. అలాగే 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్‌ వేరియంట్ ను రూ.27,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్‌ + 256 GB స్టోరేజ్‌ వేరియంట్ ను రూ.29,999 ధర వద్ద ఓపెన్ సేల్ లో కొనుగోలు చేయవచ్చు.

Also Read:BSNL Bharat Fiber కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇవే!!! జియోకు గట్టి పోటీగా...Also Read:BSNL Bharat Fiber కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇవే!!! జియోకు గట్టి పోటీగా...

వన్‌ప్లస్ నార్డ్ 90HZ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే స్పెసిఫికేషన్స్  

వన్‌ప్లస్ నార్డ్ 90HZ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే స్పెసిఫికేషన్స్  

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ నానో సిమ్ స్లాట్ లను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10-ఆధారిత ఆక్సిజన్OS 10.5 ఆధారంగా రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.44-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లేను 90HZ రిఫ్రెష్ రేట్ వద్ద 1,080x2,400 పిక్సెల్‌ల పరిమాణం మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మరియు నైట్ మోడ్, రీడింగ్ మోడ్ మరియు వీడియో ఎన్ హన్సర్ ఫీచర్ల మద్దతుతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 GSoCట్ తో రన్ అవుతూ అడ్రినో 620 GPU మరియు 12GB LPDDR4x RAM వరకు జత చేయబడి వస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ 48MP సోనీ IMX586 సెన్సార్ కెమెరా సెటప్

వన్‌ప్లస్ నార్డ్ 48MP సోనీ IMX586 సెన్సార్ కెమెరా సెటప్

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఫొటోగ్రఫీ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వన్‌ప్లస్ నార్డ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f / 1.75 లెన్స్‌తో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్‌తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో పాటు వస్తుంది. ఇంకా కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.25 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో మరియు 119 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FoV) 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంది. అలాగే ఎఫ్ / 2.4 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ కెమెరాలు కూడా లభిస్తాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ సెటప్‌లో ఎఫ్ / 2.45 లెన్స్‌తో కూడిన 32 మెగాపిక్సెల్ సోనీ IMX616 ప్రైమరీ సెన్సార్  మరియు ఎఫ్ / 2.45 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 105 డిగ్రీల ఎఫ్‌ఒవిని కలిగిన 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ నార్డ్ స్నాప్‌డ్రాగన్ 765G చిప్‌సెట్‌  

వన్‌ప్లస్ నార్డ్ స్నాప్‌డ్రాగన్ 765G చిప్‌సెట్‌  

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ 5G -ఎనేబుల్ చేసిన స్నాప్‌డ్రాగన్ 765G చిప్‌సెట్‌ను కలిగి ఉండి 12GB ర్యామ్ మరియు 256 GB స్టోరేజ్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఫోన్ వార్ప్ ఛార్జ్ 30T ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ టెక్నాలజీతో పాటు 4115mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అయితే వన్‌ప్లస్ నార్డ్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ అందుబాటులో లేదు.

Best Mobiles in India

Read more about:
English summary
OnePlus Nord Smartphone 6GB RAM Model Flash Sale Start Today at 2PM on Amazon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X