64జీబి మెమరీ స్టోరేజ్‌తో చైనా ఫోన్.. త్వరలో
ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లకు విపరీతైన గిరాకీ నెలకున్న నేపథ్యంలో అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఇక్కడి మార్కెట్ పై దృష్టిసారిస్తున్నాయి. మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ వన్ ప్లస్ భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది.

వన్ ప్లస్ కంపెనీ ‘వన్' పేరుతో మొదటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత్‌లో విడుదల కాబోతోంది. ఈ ఫోన్ 64జీబి మెమరీ వేరియంట్‌ను రూ.25,000 ధర పరిధిలో విక్రయించేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ విడదులకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికాలేదు. 16 ఇంకా 64జీబి ఇంటర్నల్ మెమెరీ వేరియంట్‌లలో ఈ హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి రానున్నట్లు మార్కెట్ వర్గాల టాక్. 64జీబి మెమరీ స్టోరేజ్‌తో లభ్యం కానున్న వన్ ప్లస్ వన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 ×1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 2.5 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీ ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపకల్పన చేయబడిన సియానోజెన్ మోడ్ 11ఎస్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి,64జీబి), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications