Home
Mobile

వన్‌ప్లస్‌ ఓపెన్‌ స్పెషల్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ వెల్లడి.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!

వన్‌ప్లస్‌ నుంచి కొత్త వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో విడుదల కానుంది. వన్‌ప్లస్‌ ఓపెన్‌ అపెక్స్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ (Oneplus Open Apex Edition) విడుదల తేదీని సంస్థ వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్‌ క్రిమ్సన్‌ రంగులో అందుబాటులోకి రానుంది. స్టాండర్డ్‌ మోడల్‌తో పోలిస్తే కొన్ని అప్‌గ్రేడ్‌లు ఉండే అవకాశం ఉంది. Hasselblad 503CW 60 సంవత్సరాల విక్టర్‌ రెడ్‌ ఎడిషన్‌కు నివాళిగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. డిజైన్ పరంగానూ కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. స్టాండర్డ్‌ మోడల్‌ తరహా స్పెషిఫికేషన్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ ఓపెన్‌ అపెక్స్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆగస్టు 7వ తేదీన విడుదల కానుంది. ఈ స్పెషల్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ మరియు క్రిమ్సన్‌ రెడ్‌ కలర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇమేజ్‌ ఎడిటింగ్‌ టూల్‌ ఫీచర్‌ సహా మెరుగైన స్టోరేజీ, సెక్యూరిటీ ఫీచర్‌లతో అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

Oneplus open Apex edition smartphone

అపెక్స్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇతర వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఎడిషన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మూడు OS అప్‌గ్రేడ్‌లను పొందుతుందని తెలుస్తోంది. ఈ ఫోన్ కేవలం సింగిల్‌ స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ స్పెషల్‌ ఎడిషన్ ధర రూ.1,39,999 గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌లు, ధరలపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వన్‌ప్లస్‌ ఓపెన్‌ స్మార్ట్‌ఫోన్‌ 7.82 అంగుళాల ఫ్లెక్సీ ఫ్యూయిడ్‌ అమోలెడ్‌ ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2k రిజల్యూషన్‌, 431ppi తో 6.31 అంగుళాల కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌, CMOS సెన్సార్‌, 48MP సోనీ LYT T808 ప్రధాన కెమెరాను కలిగి ఉంది. 64MP టెలిఫోటో కెమెరా, 48MP అల్ట్రా వైడ్ కెమెరాలతో అందుబాటులో ఉంది. 60fps తో 4K నాణ్యత కలిగి వీడియోలను రికార్డు చేయవచ్చు. ముందువైపు 20MP మరియు 32MP కెమెరాలున్నాయి.

ఈ వన్‌ప్లస్‌ ఓపెన్‌ స్టాండర్డ్‌ మోడల్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OxygenOS 13.2 పైన పనిచేస్తుంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మరియు 67W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 4805mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కేవలం 42 నిమిషాల్లో 1-100 శాతం ఛార్జింగ్ పూర్తి చేయవచ్చని వన్‌ప్లస్ తెలిపింది. అయితే వన్‌ప్లస్‌ ఓపెన్‌ అపెక్స్‌ స్పెషల్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus open Apex edition smartphone launch date revealed in india specs features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X