రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లలో OnePlus 6T

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus), తన వ్యాపార విస్తరణలో భాగంగా రిలయన్స్ డిజిటల్‌తో చేతులు కలిపింది.

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus), తన వ్యాపార విస్తరణలో భాగంగా రిలయన్స్ డిజిటల్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో నెం.1 రిటైలింగ్ చెయిన్‌గా అవతరించిన రిలయన్స్ డిజిటల్‌ వన్‌ప్లస్ మొబైల్ ఫోన్‌లను ఆఫ్‌లైన్‌లో విక్రయించబోతోంది. కస్టమర్స్ వీటిని కొనుగోలు చేసే ముందు ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశాన్ని కూడా ఈ రిటైల్ చెయిన్ కల్పించబోతోంది.

ఆఫ్‌లైన్‌‍లోనూ అదే ధర...

ఆఫ్‌లైన్‌‍లోనూ అదే ధర...

రిలయన్స్ డిజిటల్‌ స్టోర్‌లలో విక్రయించే వన్‌ప్లస్ ఫోన్‌ల పై ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఆన్‌లైన్‌లో ఎంత ధర అయితే ఉంటుందో ఆఫ్‌లైన్‌‍లోనూ అంతే ధర ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రముఖ పట్టణాల్లో రిలయన్స్ డిజిటల్‌‌కు మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. దీంతో వన్‌ప్లస్ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది.

 

 

చిన్న నగరాల్లో కూడా..

చిన్న నగరాల్లో కూడా..

వన్‌ప్లస్ తన అఫ్‌లైన్ మార్కెట్‌ను మేజర్ మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం చేయకుండా లక్నో, మంగళూరు, విశాఖపట్నం, భువనేశ్వర్, గౌహతి, మొహాలి, కోయంబత్తూర్ వంటి సెమీ నగరాలకు కూడా విస్తరించబోతోంది. రిలయన్స్ డిజిటల్‌ స్టోర్ లతో పాటు క్రోమ్ స్టోర్స్ కూడా వన్ ప్లస్ ఫోన్ లను ఆఫ్ లైన్ లో విక్రయించబోతున్నాయి. క్రోమాకు దేశవ్యాప్తంగా 110 స్టోర్లు ఉన్నాయి. వాటిలో 20 ప్రముఖ స్టోర్ లలో వన్‌ప్లస్ డివైసస్ అందుబాటులో ఉంటాయి.

ఫార్ములా విజయవంతమవటంతో...

ఫార్ములా విజయవంతమవటంతో...

ఆన్‌లైన్ బ్రాండ్‌గా మార్కెట్‌కు పరిచయమైన వన్‌ప్లస్ మొదట్లో అఫ్‌లైన్ మార్కెట్‌ను అంతగా పట్టించుకోలేదు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో తన మొదటి వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను బెంగుళూరులో నెలకొల్పింది. బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోవటంతో కంపెనీ తన ఫోకస్‌ను ఆఫ్‌లైన్ మార్కెట్ వైపు షిప్ట్ చేసింది. ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ ఫార్ములా విజయవంతమవటంతో స్టోర్‌ల సంఖ్యను వన్ ప్లస్ మరింతగా పెంచింది.

 

 

ఆండ్రాయిడ్ Pie అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్..

ఆండ్రాయిడ్ Pie అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్..

వన్‌ప్లస్ తన అప్‌కమ్మింగ్ OnePlus 6T డివైస్‌ను అక్టోబర్ 30న మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ ఫోన్ రన్ అవుతుంది. ఈ లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టంలో ఎక్విప్ చేసిన అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్ ఫోన్‌లోని అప్లికేషన్‌లను నిరంతరం మానిటర్ చేస్తూ అవసరమైన బ్యాటరీ పవర్‌ను మాత్రమే అవి ఉపయోగించుకునేలా చూస్తుంది.

ఫ్యూచరిస్టిక్ స్క్రీన్  అన్‌లాక్ టెక్నాలజీ..

ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ అన్‌లాక్ టెక్నాలజీ..

వన్‌ప్లస్ తన లేటెస్ట్ 6టీ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ అన్‌లాక్ ఫీచర్‌ను ఇన్‌బిల్ట్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ ఇంకా ఫౌండర్ Pete Lau అఫీషియల్ కన్ఫర్మ్ చేసారు. ఈ ఫీచర్‌కు సంబంధించి ఓ టీజర్‌ను కూడా వన్‌ప్లస్ విడుదల చేసింది. ఈ 5 సెకన్ల వీడియోలో ఫోన్‌లోని ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా మరింత లోతుగా రివీల్ చేసే ప్రయత్నం చేసారు. వన్‌ప్లస్ తన ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ అన్‌లాక్ టెక్నాలజీ పై అనేక నెలలపాటు శ్రమించింది. దీంతో ఫోన్ అన్‌లాక్ సమయాన్ని మిల్లీ సెకన్లలోకి తీసుకురాగలిగింది.

Best Mobiles in India

English summary
OnePlus poised at solidifying its offline presence in the Indian market.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X