మార్కెటింగ్‌లోనూ కొత్త ట్రెండ్ సృష్టిస్తోన్న OnePlus 6T
కొద్ది నెలల నుంచి రూమర్లతో సంచలనం రేకెత్తించిన వన్‌ప్లస్ 6టీ ఎట్టకేలకు మార్కెట్లోకి విడుదల అవబోతుంది.
కొద్ది నెలల నుంచి రూమర్లతో సంచలనం రేకెత్తించిన వన్‌ప్లస్ 6టీ ఎట్టకేలకు మార్కెట్లోకి విడుదల అవబోతుంది . భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటోన్న వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెల అనగా అక్టోబర్ లో విడుదల కానుంది . ఈ ఫోన్ మార్కెట్లోని మిగతా కంపెనీ ఫోన్లకు గట్టి సవాల్ విసురుతుందని తెలుస్తోంది. వన్‌ప్లస్ 6 కి అప్‌గ్రేడెడ్ మోడల్‌గా ఈ వన్‌ప్లస్ 6టీ మార్కెట్లోకి రానుంది. మార్కెట్ వర్గాల విశ్లేషణ ప్రకారం ఈ అప్‌కమ్మింగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అవుట్- ఆఫ్-ద-బాక్స్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు చేరువచేయబోతోందట.

వన్‌ప్లస్ 6టీ యాడ్
వన్‌ప్లస్ 6టీ లాంచ్ కి దగ్గర పడటంతో వన్ ప్లస్ సంస్థ ఈ ఫోన్ యొక్క అంచనాలు భారీగా పెంచేసింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లవర్స్ అంత ఎప్పుడెప్పుడా ఈ వన్‌ప్లస్ 6టీ మార్కెట్లోకి వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ యాడ్ కు బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించడంతో ఈ ఫోన్ కు మరింత పాపులారిటీ పెరిగిపోయింది. ఈ ఫోన్ యొక్క యాడ్ ను టీ వీ మరియు హాట్ స్టార్ రెండింటిలోనూ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరిగేటప్పుడు ప్రసారం చేసింది. కొనసాగుతున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఆనందించేటప్పుడు, మీరు ప్రతి బంతిని ఆట యొక్క అంచనాలను తయారు చేయగల Hotstar యాప్ పై కొత్త 6 టి చిహ్నాన్ని చూడగలుగుతారు.

ఒక ఆసక్తికరమైన సమాచారం ప్రకటనలో వెల్లడైంది
వన్ ప్లస్ సంస్థ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ యాడ్ లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీ గురించి చూయించాడు .దీని ప్రకారం వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన సెక్యూరిటీ విభాగాలను మరింత విప్లవాత్మకంగా వన్‌ప్లస్ తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన ఫ్యూచరిస్టిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీ ఫోన్ పనితీరునే పూర్తి మార్చివేయబోతోంది .

తక్కువ నాట్చ్‌తో బెటర్ క్వాలిటీ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్
వన్‌ప్లస్ 6టీకి సంబంధించిన డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరిచే క్రమంలో మినిమల్ నాట్చ్ డిజైన్‌తో ఈ ఫోన్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన క్రిస్ప్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ స్ర్కీన్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే సీమ్‌లెస్ మల్టీమీడియా వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు అందించబోతోందట. వన్‌ప్లస్ 6టీ స్ర్కీన్ పై వాటర్ డ్రాప్ తరహాలో కనిపించే నాట్చ్‌లో ఫోన్ ఫ్రంట్ కెమెరా బిల్ట్ అయి ఉంటుందట. ఫుల్ స్ర్కీన్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను తీసుకురావటం ద్వారా వన్‌ప్లస్ 6టీ యూజర్లు గేమ్స్, వెబ్ బ్రౌజింగ్ ఇంకా హైడెఫినిషన్ వీడియోలను వీక్షిస్తోన్న సమయంలో హైక్వాలిటీ విజువల్ అనుభూతులకు లోనవుతారట.

ఫాస్టర్ డ్యాష్ ఛార్జ్ టెక్నాలజీ
వన్‌ప్లస్ బ్రాండ్ తన డ్యాష్ ఛార్జ్ టెక్నాలజీ ద్వారా ఇండస్ట్రీ బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఆఫర్ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో, త్వరలో లాంచ్ చేయబోతోన్నవన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌లోనూ ఇదే తరహా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని వన్‌ప్లస్ నిక్షిప్తం చేసే అవకాశం ఉంది. రూమర్స్ మిల్స్ రివీల్ చేసిన వివరాల ప్రకారం 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశముంది.

కొత్త వెర్షన్‌లో బుల్లెట్స్ వెర్‌లైస్ హెడ్‌ఫోన్స్
ఈ ఫోన్‌తో పాటు బుల్లెట్స్ వెర్‌లైస్ హెడ్‌ఫోన్‌లను కూడా వన్‌ప్లస్ లాంచ్ చేయబోతున్నట్లు సదురు వెబ్‌సైట్ పేర్కొంది. ఈ కొత్త హెడ్‌ఫోన్స్‌లో ఫెర్ఫామెన్స్, బ్యాటరీలైఫ్ ఇంకా సోనిక్ సిగ్నేచర్ పరంగా మార్పు చేర్పులు ఉండొచ్చని తెలుస్తోంది. BT32B అనే మోడల్ నెంబర్‌తో విడుదల కాబోతోన్న ఈ విప్లవాత్మక ఇయర్‌ఫోన్స్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.3,990 వరకు ఉండొచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications








