వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఈ స్పెషల్ సేల్ ఆఫర్‌లు మీకోసమే..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (Oneplus India) నుంచి కీలక ప్రకటన విడుదల అయింది. రెడ్ రష్ డేస్ సేల్ పేరుతో ప్రత్యేక సేల్ ను ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. ఈ సేల్ ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 16 వ తేదీ వరకు కొనసాగుతుంది. వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారికి ఈ సేల్ ఉపయోగపడుతుంది.
వన్‌ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్ లో (Oneplus Red Rush days sale 2025) భాగంగా వన్‌ప్లస్ 13 సహా ఇతర స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు డిస్కౌంట్ ల ద్వారా మరింత డిస్కౌంట్ ను పొందవచ్చు. అయితే ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌ల పైనా డిస్కౌంట్‌లను పొందవచ్చు.

భారత్ మార్కెట్ లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ ను కూడా డిస్కౌంట్ ధరలకు సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే విధంగా 13R వేరియంట్ పై రూ.3000 తగ్గింపును పొందవచ్చు.
వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ (OnePlus 13) 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ, 24GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ప్రారంభ ధర రూ.69,999 గా ఉంది. ఆర్కిటిక్ డాన్, మిడ్‌నైట్ ఓషన్, బ్లాక్ ఎక్లిప్స్ రంగుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 6.82 అంగుళాల క్వాడ్ HD+ LTPO 4.1 ProXDR డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్ సపోర్టుతో సిరామిక్ గార్డ్ రక్షణ పొందుతుంది. ఆండ్రాయిడ్ 15 OxygenOS 15.0 తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP (OIS) ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 100W వైర్ Supervooc ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ వన్‌ప్లస్ సేల్ లో భాగంగా వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ నార్డ్ 4, నార్డ్ CE 4, వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ స్మార్ట్‌ఫోన్ లు సహా వన్‌ప్లస్ ట్యాబ్లెట్ లు, ఇతర ఆడియో ఉత్పత్తులపై డిస్కౌంట్ లను పొందవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్‌పై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే నార్డ్ 4 మోడల్‌పై రూ.4000, నార్డ్ CE 4 లైట్ హ్యాండ్‌సెట్‌పై రూ.2000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఈ సేల్ డిస్కౌంట్‌లతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో మరింత తగ్గింపును పొందవచ్చు. వీటితోపాటు ఇయర్‌బడ్స్, స్మా్ర్ట్‌వాచ్, స్మార్ట్‌ఫోన్ కేస్, ఛార్జింగ్ కేబుల్స్‌ను కూడా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం కాగా.. 16 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








