గిన్నీస్ బుక్‌లో OnePlus 6T

ఇండియన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్రవేసిన వన్‌ప్లస్ లేటెస్ట్ గా OnePlus 6T ను ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేసింది.

|

ఇండియన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్రవేసిన వన్‌ప్లస్ లేటెస్ట్ గా OnePlus 6T ను ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేసింది.ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో రికార్డుల హోరును తలపిస్తూ పోతోంది. ఈ OnePlus 6T స్మార్ట్ ఫోన్ ప్రారంభించిన 48 గంటల్లోనే ఒకే సమయంలో అన్బాక్సింగ్ చేస్తూ గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించింది.

oneplus-set-new-guinness-world-records-title-the-most-people-unboxing-simultaneously

559 వన్‌ప్లస్ కమ్యూనిటీ మెంబెర్స్ రిచార్డ్సన్ మరియు క్రుడాస్ లో ఏకకాలంలో OnePlus 6T ను unbox మరియు ఎక్స్పీరియన్స్ చేయడానికి కలిసి వచ్చారు. వారు అంతా వన్‌ప్లస్ నుండి తాజా సాంకేతిక ఆవిష్కరణలు ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చిన మొదటి సెట్ వినియోగదారులు.

గురువారం, నవంబరు 1 న ఉదయం 8.30 గంటలకు రికార్డు ప్రయత్నం మొదలైంది. ఈ కార్యక్రమంలో అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జడీకేటర్ రిషి నాథ్ సమక్షంలో హాజరయ్యారు. అదేవిధంగా, ఈ కార్యక్రమంలో ప్రెజెంటర్, ఫిట్నెస్ మోడల్ మరియు నటి, బాణీ J మరియు భారతీయ గేయ రచయిత, రాప్ కళాకారుడు మరియు సంగీత నిర్మాత బ్రోడా వి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

OnePlus 6T స్పెక్స్...
 

OnePlus 6T స్పెక్స్...

OnePlus 6T స్మార్ట్‌ఫోన్ 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డి (రిసల్యూషన్ 1080×2340 పిక్సల్) డిస్‌ప్లేతో మార్కెట్లోకి లాంచ్ అయింది.వన్‌ప్లస్ తన OnePlus 6T మోడల్‌తో పరిచయం చేయబోతోన్న ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ టెక్నాలజీ రెగ్యులర్ బయోమెట్రిక్ స్కానర్స్‌తో పోలిస్తే మరింత అప్‌డేటెడ్‌గా ఉంటుంది. OnePlus 6T డివైస్‌లోని స్క్రీన్ అన్‌లాక్ కేవలం ఒక మాడ్యుల్ మాత్రమే కాదు, ఈ టెక్నాలజీ ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంకా హార్డ్‌వేర్ కాంపోనెంట్‌లను కలుపుకుని ముందుకు సాగుతుంది.

ఇక ర్యామ్ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6 మాదిరిగానే 6టీ మోడల్ లో కూడా 6జీబి ఇంకా 8జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందబాటులో ఉంది. స్టోరేజ్ పరంగా 128జీబి ఇంకా 256జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ డివైస్‌ను అందుబాటులో ఉంచారు.

కెమెరా విషయానికి వచ్చేసరికి OnePlus 6T మోడల్‌లో ఒప్పో, వివో తరహాలోనే పాప్-అప్ కెమెరా మెకనిజంను ఏర్పాటు చేసారు.ట్రిపుల్ రేర్ కెమెరా సపోర్టుతో ఈ ఫోన్ లభిస్తుంది . ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి మెరుగుపరచబడిన సోనీ సెన్సార్‌తో కూడిన 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూనిట్‌లు డివైస్‌లో నిక్షిప్తం చేసారు.

యూజర్ ఫింగర్ ప్రింట్‌ను యాక్యురేట్‌గా రీడ్ చేసి రిజిస్టర్ చేసేందుకు గాను చిన్న లెన్స్‌ను ఏర్పాటు చేసారు. యూజర్ ఫింగర్ ప్రింట్‌కు సంబంధించిన అవుట్ లైన్‌ను మరింతగా ఎన్‌హాన్స్ చేసే క్రమంలో లైట్ సోర్సును OnePlus 6T ఉపయోగించుకుంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించిన హార్డ్‌వేర్‌కు సెల్ఫ్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్స్‌ను కంభైన్ చేయటంతో పాటు ఫింగర్ ప్రింట్ సమాచారం మిల్లీ సెకన్లలో ప్రీ-లోడ్ కాబడి వేగవంతమైన ఇన్-డిస్‌ప్లే అన్‌లాక్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్‌కు ప్రొవైడ్ చేస్తుంది. యూజర్‌కు సంబంధించిన ఫింగర్ ప్రింట్ సమాచారాన్ని స్టోర్ చేసే క్రమంలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 సాక్‌లోని ‘Trust Zone' అనే డెడికేటెడ్ సాంకేతికతను వన్‌ప్లస్ ఇంజినీర్లు ఉపయోగించారు.

OnePlus 6T స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ భారత్‌లో రూ.37,999 ధరకు లభ్యం కానుంది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.41,999 ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.45,999 గా ఉంది.

 

OnePlus ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ మాట్లాడుతూ...

OnePlus ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ మాట్లాడుతూ...

ఈ OnePlus 6T ను తయారు చేయడానికి తమ ఇంజినీర్లు ఎంత గానో కష్టపడ్డారని,యూజర్ కి గొప్ప ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం తాము ఇంతలా కష్టపడ్డామని చెప్పారు. అలాగే ఈ యొక్క కొత్త ఫోన్ ను అన్ బాక్సింగ్ చేయడం చాలా ప్రత్యకంగా ఉందని , మరియు మా తాజా ఫ్లాగ్షిప్ OnePlus 6T కోసం, చరిత్ర సృష్టించేందుకు వందలాది మంది కమ్యూనిటీ సభ్యులు కలిసి రావడం మనసుకి చాలా ఆనందంగా ఉంది అని వారు తెలిపారు.

రిషి నాథ్, గైనింగ్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ మాట్లాడుతూ...

రిషి నాథ్, గైనింగ్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ మాట్లాడుతూ...

ఈ OnePlus 6T స్మార్ట్ ఫోన్ ను అన్-బాక్సింగ్ చేయడానికి వచ్చిన ఇంతమంది వన్‌ప్లస్ కమ్యూనిటీ మెంబెర్స్ ను చూడడం చాలా ఆనందంగా ఉందని వారి ఉత్సాహం,ఎనర్జీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉందని తెలిపారు.

Best Mobiles in India

English summary
OnePlus set a new Guinness World Records title for the Most People Unboxing simultaneously.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X