Home
Mobile

OnePlus ఫోన్‌లకు రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్

ఇండియన్ మార్కెట్లో తన వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి 8జీబి ర్యామ్/256జీబి స్టోరేజ్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన వన్‌ప్లస్ తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది.

By Bommu Sivanjaneyulu

ఇండియన్ మార్కెట్లో తన వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి 8జీబి ర్యామ్/256జీబి స్టోరేజ్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన వన్‌ప్లస్ తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ఇటీవల లాంచ్ చేసిన అన్ని వన్‌ప్లస్ డివైస్‌లకు సంబందించి సాఫ్ట్‌వేర్ మెయింటేనెన్స్ షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తున్నట్లు సంస్థ సీఈఓ Pete Lau తెలిపారు. ఈ మెయింటేనెన్స్ షెడ్యూల్‌‌లో భాగంగా ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు రెండు సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ రిలీజెస్ కూడా లభిస్తాయి. షాంఘై వేదికగా జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ మెయింటేనెన్స్ షెడ్యూల్‌‌తో పాటు పలు ఆసక్తికర వివరాలను వన్‌ప్లస్ రివీల్ చేసింది. తన మొదటి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాదే మార్కెట్లో లాంచ్ చేస్తామని, యూఎస్‌ మార్కెట్లో ఈ డివైస్‌ను నెట్‌వర్క్ క్యారియర్ల సహాయంతో విక్రయిస్తామని వన్‌ప్లస్ తెలిపింది.

ONEPLUS 6

ఆ ఫోన్‌ల జాబితా ఇదే..
తాము నూతనంగా లాంచ్ చేసిన వన్‌ప్లస్ మెయింటేనెన్స్ షెడ్యూల్ ప్రస్తుతానికి వన్‌ప్లస్ 3, వన్‌ప్లస్ 3టీ, వన్‌ప్లస్ 5, వన్‌‌ప్లస్ 5టీ ఇంకా వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌లకు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ వన్‌ప్లస్ యూజర్లకు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. ప్రతీ రెండు నెలలకు ఒకసారి సెక్యూరిటీ ప్యాచెస్ రిలీజ్ చేస్తామని, ఇదే టైమ్ ఫ్రేమ్‌లో భాగంగా బగ్ ఫిక్సెస్ అలానే వెర్షన్ అప్‌డేట్స్ కూడా అందుబాటులో ఉంచుతామని కంపెనీ హామీ ఇచ్చింది.

22 రోజుల్లో 10 లక్షల యూనిట్లు..
ఇదిలా ఉండగా తమ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన OnePlus 6ను 22 రోజుల్లో 10 లక్షల మంది యూజర్లు కొనుగోలు చేసినట్ల వన్‌ప్లస్ సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా ఆ సంస్థ సీఈఓ పీటర్ లా మాట్లడుతూ తమ కమ్యూనిటీకి అంచనాలకు మించిన ఆదరణ లభిస్తోందని, ఈ విజయంలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు తెలిపారు.

వన్‌ప్లస్ 6 స్పెసిఫికేషన్స్..
డ్యుయల్ నానో సిమ్ సపోర్ట్, ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 8.1 ఓరియో సపోర్ట్, 6.28 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (1080x 2280 పిక్సల్స్) ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి), 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ ఐఎమ్ఎక్స్371 సెన్సార్, 3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

Best Mobiles in India

English summary
OnePlus launched the 8GB RAM/ 256GB storage OnePlus 6 variant without the Marvel branding just days ago, and has priced it at Rs. 43,999. Now, the company has also released its Software Maintenance Schedule, promising two years of software updates and three years of security releases for all of its recent OnePlus devices.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X