OnePlus Sale 2025 వన్‌ప్లస్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. వీటిపై భారీ డిస్కౌంట్‌లు!
భారత్ మార్కెట్‌లో త్వరలో వరుస సేల్‌లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అమెజాన్ సమ్మర్ సేల్ ను ప్రకటన చేసింది. ఫ్లిప్‌కార్ట్ కూడా ప్రత్యేక సేల్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. అమెజాన్ మే 1 వ తేదీ నుంచి, ఫ్లిప్‌కార్ట్ సేల్ మే 2 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి 7 వ వార్షికోత్సవం సందర్భంగా మే 1 వ తేదీ నుంచి ప్రత్యేక సేల్‌ను నిర్వహించనుంది.
వన్‌ప్లస్ సమ్మర్ సేల్ 2025 వివరాలు :
అయితే తాజాగా మరో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. సమ్మర్ సేల్‌ను (OnePlus Summer Sale 2025) నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ వన్‌ప్లస్ సేల్ మే 1 వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలిపింది. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి స్టో్ర్స్ ద్వారా కొనుగోలు చేసే వన్‌ప్లస్ ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. మే 11 వరకు ఈ సేల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

వన్‌ప్లస్ 13, 13R స్మార్ట్‌ఫోన్‌లతోపాటు :
వన్‌ప్లస్ సమ్మర్ సేల్ 2025 లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్స్, ఆడియో ఉత్పత్తులు సహా ఇతర గ్యాడ్జెట్స్‌ను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా వన్‌ప్లస్ 13 (OnePlus 13), వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ (OnePlus 13R Smartphone), వన్‌ప్లస్ నార్డ్ 4 హ్యాండ్‌సెట్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ సమ్మర్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే 13R ను కొనుగోలుపై రూ.3000 తగ్గింపును పొందవచ్చు. వన్‌ప్లస్ 13R ఫోన్, వన్‌ప్లస్ బడ్స్ 3 ను కలిపి కొనుగోలు చేస్తే మరింత ధర తగ్గుతుంది.
వన్‌ప్లస్ 12 హ్యాండ్‌సెట్ :
ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ (OnePlus 12 Smartphone) పై గరిష్ఠంగా రూ.6000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 4 పైన గరిష్టంగా రూ.5000 తగ్గింపును పొందవచ్చు. నార్డ్ CE 4 హ్యాండ్‌సెట్ రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. నార్డ్ CE 4 Lite 5G ఫోన్‌ను గరిష్టంగా రూ.2000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ ప్యాడ్ 2 :
వన్‌ప్లస్ సమ్మర్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ ప్యాడ్ 2 ను (OnePlus Pad 2) భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో రూ.3000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. అదే ఎక్స్చేంజీ బోనస్ ద్వారా రూ.3000 అదనపు తగ్గింపును పొందవచ్చు.
స్మార్ట్‌వాచ్, బడ్స్ పై కూడా :
వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 (OnePlus Buds Pro 3) మరియు బడ్స్ 3 (OnePlus Buds 3) పైన బ్యాంకు ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్‌లతో కలిపి గరిష్ఠంగా రూ.2500 తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ వాచ్ 2R ను గరిష్టంగా రూ.5000, అదే వాచ్ 2 మోడల్ పై మొత్తంగా రూ.6000 తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications