దిగ్గజాలకు వన్‌ప్లస్ షాక్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రారాజు !
భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్‌లో దూసుకుపోతున్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్‌లను వెనక్కి నెట్టేసి టాప్ లీడర్ గాఎదిగింది.
ప్రీమియం మార్కెట్లో దిగ్గజాలను వన్‌ప్లస్ వెనక్కి నెట్టేసింది. భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్‌లో దూసుకుపోతున్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్‌లను వెనక్కి నెట్టేసి టాప్ లీడర్ గా ఎదిగింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజాగా వెల్లడించిన రిపోర్టులో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో శాంసంగ్, ఆపిల్‌ను మించిపోయి వన్‌ప్లస్ లీడ్‌లోకి వచ్చినట్టు తెలిసింది. మొట్టమొదటిసారి వన్‌ప్లస్ కంపెనీ ఈ చోటును దక్కించుకున్నట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. 2018 రెండో క్వార్టర్‌లో 40 శాతం మార్కెట్ షేరుతో వన్‌ప్లస్ ఈ స్థానాన్ని సంపాదించుకుంది.

వన్‌ప్లస్ 6
ఈ కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6 బలమైన అమ్మకాలే వన్‌ప్లస్‌ను టాప్ స్థానంలో నిలబెట్టడానికి దోహదం చేశాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. వన్‌ప్లస్ 6 రికార్డు షిప్‌మెంట్లను నమోదు చేసినట్టు తెలిపింది.

ఆపిల్, శాంసంగ్ షిప్‌మెంట్లు
దిగ్గజ కంపెనీలైన ఆపిల్, శాంసంగ్ షిప్‌మెంట్లు ఏడాది ఏడాదికి కిందకి పడిపోయినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది.

గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్9
34 శాతం షేరుతో శాంసంగ్ ఈ సెగ్మెంట్‌లో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది లాంచ్ చేసిన గెలాక్సీ ఎస్8 కంటే, గెలాక్సీ ఎస్9 షిప్‌మెంట్లు 25 శాతం పడిపోయాయి. షిప్‌మెంట్లు పడిపోయినప్పటికీ, ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్9 సిరీస్ ప్రమోషన్లు బలంగానే ఉన్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది.

ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్
మరోవైపు ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్ లకు డిమాండ్ ఈ క్వార్టర్‌లో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఆపిల్ మార్కెట్ షేరు భారీగా పడిపోయింది.

కేంద్రం డ్యూటీలను పెంచడంతో..
కేంద్రం డ్యూటీలను పెంచడంతో, ఆపిల్ కూడా తన ప్రొడక్ట్‌లపై ధరలను పెంచింది. దీంతో ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్ సిరీస్ షిప్‌మెంట్లు క్షీణించాయి.

కంపెనీ మార్కెట్ షేరు
ఇదే సమయంలో కంపెనీ మార్కెట్ షేరు కూడా ప్రీమియం సెగ్మెంట్‌లో భారీగా పడిపోయి కేవలం 14 శాతం మాత్రమే నమోదైంది.

హువాయి(పీ20), వివో(ఎక్స్21), నోకియా
అయితే మొత్తంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ ఈ క్వార్టర్‌లో వార్షికంగా 19 శాతం పెరిగింది. ఈ సెగ్మెంట్‌లోకి హువాయి(పీ20), వివో(ఎక్స్21), నోకియా హెచ్‌ఎండీ(నోకియా 8 సిరోకో), ఎల్‌జీ(వీ30 ప్లస్) స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు కొత్తగా వచ్చి చేరాయి.

మొత్తం మార్కెట్ షేరు 88 శాతం
శాంసంగ్, వన్‌ప్లస్, ఆపిల్ టాప్-3 బ్రాండ్‌లు మొత్తం మార్కెట్ షేరు 88 శాతంగా ఉంది. ఇది ముందు క్వార్టర్‌లో 95 శాతంగా నమోదైంది.


Click it and Unblock the Notifications








