9000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, అమోలెడ్ డిస్‌ప్లేతో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు!
OnePlus Turbo 6 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తాజాగా వన్‌ప్లస్ టర్బో 6, టర్బో 6V స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు ఏకంగా 9000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్‌లు IP66, IP68, IP69, IP69K రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లు అమోలెడ్ డిస్‌ప్లేతోపాటు 50MP ప్రైమరీ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ల పూర్తి వివరాలు.
వన్‌ప్లస్ టర్బో 6 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
ఈ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రీఫ్రెష్ రేట్ 60Hz - 165Hz గా ఉంటుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 450 ppi పిక్సల్ డెన్సిటీ, 330Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. Adreno 825 GPU ను కూడా అమర్చారు. ఈ చిప్‌సెట్ 16GB LPDDR4x ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్, 16MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 9000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
వన్‌ప్లస్ టర్బో 6V స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
ఈ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 450 ppi పిక్సల్ డెన్సిటీ, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 93.5 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోను కలిగి ఉంది.
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్ ను కలిగి ఉంది. Adreno 810 GPU ను కూడా అమర్చి ఉంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR4x ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్ లెన్స్, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 9000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
వన్‌ప్లస్ టర్బో 6, టర్బో 6V స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం చైనాలో మాత్రమే విడుదల అయ్యాయి. భారత్‌లో ఈ ఫోన్ విడుదలపై ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. టర్బో 6 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర CNY 2099 (భారత కరెన్సీ ప్రకారం రూ.27000) గా ఉంది. అదే టర్బో 6V స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర CNY 1699 (భారత కరెన్సీ ప్రకారం రూ.21000) గా ఉంది.


Click it and Unblock the Notifications








