Home
Mobile

వన్‌ప్లస్ నుంచి OnePlus 6 సీరిస్‌లో స్పెషల్ ఎడిషన్

OnePlus యూజర్లు వచ్చే నెలలో కంపెనీ నుంచి మంచి సర్ ప్రైజ్ గిప్ట్ ను అందుకోబోతున్నారు. ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సత్తా చాటేందుకు మార్వెల్ స్టూడియోతో OnePlus జట్టుకట్టింది.

By Hazarath Aiah

OnePlus యూజర్లు వచ్చే నెలలో కంపెనీ నుంచి మంచి సర్ ప్రైజ్ గిప్ట్ ను అందుకోబోతున్నారు. ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సత్తా చాటేందుకు మార్వెల్ స్టూడియోతో OnePlus జట్టుకట్టింది. ఇందులో భాగంగా కంపెనీ OnePlus 6 సీరిస్ లో ఓ స్పెషల్ ఎడిషన్ ని మార్కెట్లోకి తీసుకొస్తోంది. డిస్నీ ఇండియాతో కలిసి వన్ ప్లస్ ని బలోపేతం చేసేందుకు కంపెనీ సరికొత్తగా ముందుకు దూసుకొస్తోంది.కంపెనీ తన టీజర్లో ఓ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. OnePlus 6 సీరిస్ లో OnePlus 6 x Marvel Avengers Limited Edition ని మే 17 2018న లాంచ్ చేయనుంది. ఈ స్పెషల్ ఎడిషన్ అమెజాన్లో ఎక్స్లక్లూజివ్ గా అందబాటులో ఉండనుంది. దీని ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

డిస్నీ పార్టనర్ గా ..

డిస్నీ పార్టనర్ గా ..

గతేడాది డిస్నీ పార్టనర్ గా వన్ ప్లస్ కంపెనీ OnePlus 5T Star Wars Limited Editionని లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫోన్ చాలామందిని ఆకట్టుకున్నది కూడా. ఇప్పుడు అదే ఊపులో కంపెనీ వన్ ప్లస్ 6 స్పెషల్ ఎడిషన్ ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ కొత్త వాల్ పేపర్స్ అలాగే సరికొత్త లుక్, న్యూ ధీమ్స్ తో వినియోగదారులను అలరించనుంది.

OnePlus 6 x Marvel Avengers Limited Edition

OnePlus 6 x Marvel Avengers Limited Edition

కంపెనీ OnePlus 6 x Marvel Avengers Limited Edition మీద ఓ టీజర్ వీడియోని వదిలింది. ఈ వీడియో సరికొత్త లుక్ తో అభిమానులను కట్టిపడేస్తుందని బెస్ట్ క్లాస్ స్పెషిఫికేషన్స్ తో వినియోగదారులను ఇట్టే కట్టి పడేసే అవకాశం ఉందని టీజర్ ని బట్టి తెలుస్తోంది. స్పీడ్ లో ఈ ఫోన్ అన్ని ఫోన్లకు సవాల్ విసురుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

6,000 complimentary movie tickets

6,000 complimentary movie tickets

కాగా కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ మీద ఇప్పటికే 6,000 complimentary movie ticketsని త్వరలో రానున్న మార్వెల్ మూవి కోసం అనౌన్స్ చేసింది. పేటీఎమ్ పార్టనర్ షిప్ ద్వారా ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. కాగా ఈ టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. కేవలం 30 నిమిషాల్లో ఈ టికెట్లు అమ్ముడుపోయినట్లు కంపెనీ తెలిపింది. Mumbai, New Delhi, Bangalore, Chennai, Kolkata, Chandigarh, Hyderabad, Kochi, Pune, and Ahmedabad లాంటి నగరాల్లోని వన్ ప్లస్ యూజర్లు దీన్ని వీక్షించవచ్చు.

OnePlus 6 మీద..

కంపెనీ నుంచి రానున్న OnePlus 6 మీద యూజర్లు అనేక అంచనాలు పెట్టుకున్న నేపధ్యంలో ఫోన్ ఎలా వస్తుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. టీజర్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. స్పీడ్, పనితీరులో ఈ ఫోన్ ఇతర ఫోన్లకు సవాల్ విసిరే అవకాశం ఉన్నట్లు టీజర్ లోని వీడియోని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

6GB/8GB RAM వేరియంట్లలో..

6GB/8GB RAM వేరియంట్లలో..

కాగా వన్ ప్లస్ 6 Snapdragon 845 SoCతో వస్తోంది. 6GB/8GB RAM వేరియంట్లలో లాంచ్ కానుంది. ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికొస్తే 128GB and 256GBలతో రానుంది. లుకింగ్ విషయంలో అభిమానులకు మంచి సందడి వాతావరణాన్ని అందించనుంది. ఇతర వన్ ప్లస్ ఫోన్ల కన్నా ఈ ఫోన్ వినియోగదారుల చేతుల్లో ఓ సరికొత్త అనుభూతిని అందింస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. water-dust resistant design ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. sport a glass rear panel, wireless charging support వంటి అదనపు ఫీచర్లు ఉంటాయని అంచనా. ఈ ఫోన్ మీద మరింత సమాచారాన్ని మీరుఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే గిజ్‌బాట్. కామ్ ని టచ్ చేయగలరు.

Best Mobiles in India

English summary
OnePlus to unveil OnePlus 6 x Marvel Avengers Limited Edition on May 17 More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X