OnePlus 6T బంపరాఫర్, ముందు వాడండి నచ్చితేనే కొనండి!

OnePlus 6T విడదులకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో యావత్ స్మార్ట్‌ఫోన్ ప్రపంచం ఈ ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

|

OnePlus 6T విడదులకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో యావత్ స్మార్ట్‌ఫోన్ ప్రపంచం ఈ ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అక్టోబర్ 30న అఫీషియల్‌గా లాంచ్ కాబోతోన్న ఈ లేటెస్ట్ డివైస్ మార్కెట్లోకి రాకముందే రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్స్ Amazon.inలో ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవాలనుకునే వారు అమెజాన్ వన్‌ప్లస్ 6టీ పేజీలోకి వెళ్లి రూ.1000 ఖరీదు చేసే ఈ-గిఫ్ట్ కార్డును కొనుగోలు చేయవల్సి ఉంటుంది. ఈ ఫోన్‌ను అమెజాన్ ద్వారా ప్రీ-బుక్ చేసుకునే కస్టమర్‌లకు ఫోన్‌తో పాటుగా రూ.1490 ఖరీదు చేసే టైప్-సీ బుల్లెట్ ఇయర్ ఫోన్‌లతో పాటు రూ.500 అమెజాన్ పే బ్యాలన్స్ ఉచితంగా లభిస్తుంది.

9 నగరాల్లో వన్‌ప్లస్ పాప్-అప్స్..

9 నగరాల్లో వన్‌ప్లస్ పాప్-అప్స్..

OnePlus 6T విడుదలను పురస్కరించుకుని 9 నగరాల్లోని 12 లొకేషన్‌లలో పాప్-అప్ ఈవెంట్‌లను ప్లాన్ చేసినట్లు వన్‌ప్లస్ తెలిపింది. నవంబర్ 2 నుంచి ఈ పాప్-అప్స్ లైవ్‌లోకి వస్తాయి. ఈ పాప్-అప్ ఈవెంట్‌లలో పార్టిసిపేట్ చేసే యూజర్లు ముందుగా ఫోన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసి ఆ తరువాత కొనాలా వద్దా అన్న డెషిషన్‌ను తీసుకోవచ్చు. బెంగుళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇంకా జైపూర్ నగరాల్లో ఈ పాప్-అప్స్ లైవ్స్ అందుబాటులో ఉంటాయి. ఈ పాప్-అప్ ఈవెంట్‌లకు ముందుగా హాజరయ్యే వారికి వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కవర్స్, బంపర్స్, స్కెచ్‌ ‌బుక్స్, టీ-షర్ట్స్ ఇంకా టోట్ బ్యాగ్స్ ఉచితంగా లభిస్తాయి.

అదనపు బెనిఫిట్స్..

అదనపు బెనిఫిట్స్..

ఇటీవల నిర్వహించిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌లకు ‌మంచి రెస్పాన్స్ లభించింది. సేల్ ప్రారంభమైన 36 గంటల్లోనే 400 కోట్ల ఖరీదు చేసే వన్‌ప్లస్ 6టీ ప్రీ-బుకింగ్స్ అమెజాన్‌కు లభించాయి. ఈ ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకునే యూజర్లకు క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎమ్ఐ, 12 నెలల ఉచిత డ్యామేజ్ ప్రొటెక్షన్ వంటి అదనపు బెనిఫిట్స్ ను అమెజాన్ ప్రొవైడ్ చేస్తుంది.

లాంచ్ ఈవెంట్ ఎప్పుడు..?

లాంచ్ ఈవెంట్ ఎప్పుడు..?

ఇండియాలో వన్‌ప్లస్ 6టీ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 30, 2018న జరుగుతుంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కాంప్లెక్స్ లో రాత్రి 8.30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ లాంచ్ ఈవెంట్‌ను వన్‌ప్లస్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానులకు అక్కడ ఏర్పాటు చేసే ఎక్స్‌పీరియన్స్ జోన్‌లో ఫోన్‌ను చేతితో పట్టుకుని చూడటంతో పాటు డివైస్ పనితీరను విశ్లేషించే వీలుంటుంది. ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యే ఫ్యాన్స్‌కు వన్‌ప్లస్ బుల్లెట్ వెర్‌లైస్ హెడ్‌ఫోన్స్, వన్‌ప్లస్ పిన్ సెట్, వన్‌ప్లస్ స్కెచ్‌బాక్స్ ఇంకా వన్ ప్లస్ మర్చండైస్‌లతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్ లభిస్తుంది.

Android Pie ఓఎస్‌తో వస్తోన్న మొదటి నాన్-పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌...

Android Pie ఓఎస్‌తో వస్తోన్న మొదటి నాన్-పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌...

Android Pie ఆపరేటింగ్ సిస్టంతో భారత్ లోకి అడుగుపెట్టబోతోన్న మొదటి నాన్-పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ 6టీ గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంలోని అడాప్టివ్ బ్యటరీ ఫీచర్ ఫోన్‌లోని అప్లికేషన్‌లను నిరంతరం మానిటర్ చేస్తూ అవసరమైన బ్యాటరీ పవర్‌ను మాత్రమే అవి ఉపయోగించుకునేలా చూస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 మొబైల్ చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఈ డివైస్‌లో ప్రాసెసింగ్ మరింత యాక్యురేట్‌గా ఉంటుంది.

ఈ ఫోన్‌లో ఎక్విప్ చేసిన ఫ్యూచరిస్టిక్ స్ర్కీన్ అన్‌లాక్ ఫీచర్ డివైస్‌ను వేగవంతంగా అన్‌లాక్ చేయగలుగుతుంది. వన్‌ప్లస్ 6తో పోలిస్తే వన్‌ప్లస్ 6టీ పెద్దదైనా ఇంకా శక్తివంతమైన బ్యాటరీతో రాబోతోంది. ఇదే సమయంలో డాష్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మరింతగా అప్‌డేట్ చేసినట్లు స్పష్టమవుతోంది. బ్యాటరీ పనితీరు విషయంలో ఇప్పటికే మంచి రెప్యుటేషన్‌ను సొంతం చేసుకున్న వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు భవిష్యత్‌లోనూ ఇదే విధమైన ట్రెండ్ ను కొనసాగిస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

Best Mobiles in India

English summary
OnePlus wants you to experience the flagship smartphone before making the purchase decision.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X