సరికొత్త నవీకరణలతో ఒపెరా మినీ 8 బ్రౌజర్

Posted By:

గూగుల్ క్రోమ్.. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వంటి ప్రముఖ ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్‌లకు ఏ మాత్రం తీసుపోకుండా ఒపెరా (Opera) మొబైల్ వెబ్ బ్రౌజర్ అంతర్జాల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుని ముందుకు సాగుతోంది. తాజాగా ఒపెరా, ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ లో కోసం తమ మొబైల్ అప్లికేషన్ బ్రౌజర్‌ను నవీకరించింది. యాపిల్ ఐఓఎస్ కోసం ఒపెరా అందుబాటులోకి తీసుకువచ్చిన ఒపెరా మినీ 8 బ్రౌజర్ ఐపోన్ ఇంకా ఐప్యాడ్ యూజర్లకు మరింత సౌకర్యవంతమైన వెబ్ బ్రౌజింగ్ ను చేరువచేస్తుంది.

ఒపెరా బ్రౌజర్ గురించి క్లప్తంగా...

ఈ మొట్ట మొదటి మొబైల్ వెబ్ బ్రౌజర్ నెట్‌వర్క్ నెమ్మదిగా ఉన్నప్పటికి వేగంగా స్పందించగలదు. ఈ బ్రౌజర్‌లో నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన సాంకేతికత బ్రౌజింగ్ సమయంలో వెబ్‌సైట్‌ల ద్వారా అందే సమచారాన్ని బాగా కంప్రెస్ చేస్తుంది. దాంతో డేటా బిల్లులను తగ్గించుకోవచ్చు. ఆండ్రాయిడ్, యాపిల్, బ్లాక్‌బెర్రీ, సింబియాన్ వంటి అన్నిరకాల ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఈ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది. ఒపెరా బ్రౌజర్‌లో ఏర్పాటు చేసిన ‘స్మార్ట్ పేజ్' ఫీచర్ ద్వారాసోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌‍సైట్‌లు ఇంకా ఇతర వెబ్ పేజీలకు వేగంగా కనెక్ట్ కావచ్చు. ఇతర బ్రౌజర్‌లతో పోలిస్లే ఒపెరా మినీ బ్రౌజర్ పదోవంతు బ్యాండ్ విడ్త్ మాత్రమే ఉపయోగిస్తుంది.

అలాగే బ్రౌజర్‌లో ఏర్పాటు చేసిన డేటా సేవింగ్ కాలిక్యులేటర్ ద్వారా డేటా వినియోగానికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వ్యక్తిగత మెయిల్, సోషల్ నెట్‌వర్కింగ్, బ్యాంకింగ్ ఇలా అనేకమైన ఆన్‌లైన్ అకౌంట్‌లకు సంబంధించి మీరు ఉపయోగించే  పాస్‌వర్డ్‌లన్నింటిని ఒక దగ్గర సురక్షితంగా స్టోర్ చేసుకునేందుకు పాస్‌వర్డ్ మేనేజర్ ఉంటుంది. డెస్క్‌టాప్ తరహాలోనే ఒక విండోలోనే అనేక వెబ్‌సైట్‌లు ఓపెన్ చేసుకునేందకు అలానే అవసరమైన వెబ్ పేజీని సలువుగా ఎంచుకునేందుకు ట్యాబ్ బ్రౌజింగ్ సౌకర్యాన్ని ఈ బ్రౌజర్‌లో ఏర్పాటు చేసారు.

యాపిల్ ఐఓఎస్ కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేయబడిన ఒపెరా మినీ 8 ప్రత్యేకతలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సరికొత్త నవీకరణలతో ఒపెరా మినీ 8 బ్రౌజర్

యాపిల్ ఐవోఎస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒపెరా మినీ 8 బ్రౌజర్ వేగవంతమైన అవగాహనా సామర్ధ్యాలను కలిగి సురక్షితమైన అలానే వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్‌కు సహకరిస్తుంది.

సరికొత్త నవీకరణలతో ఒపెరా మినీ 8 బ్రౌజర్

టర్బో మోడ్

ఒపెరా మినీ 8 బ్రౌజర్ లో ఏర్పాటు చేసిన టర్బో మోడ్ ఫీచర్ ద్వారా వెబ్‌సైట్ లుక్‌ను ఏ మాత్రం మార్చకుండానే డేటాను కంప్రెస్ చేసుకోవచ్చు. తద్వారా డేటా వినియోగాన్ని ఆదా చేసుకోవచ్చు.

సరికొత్త నవీకరణలతో ఒపెరా మినీ 8 బ్రౌజర్

సరికొత్త నవీకరణలతో ఒపెరా మినీ 8 బ్రౌజర్

సరికొత్త నవీకరణలతో ఒపెరా మినీ 8 బ్రౌజర్

వ్యక్తిగత మెయిల్, సోషల్ నెట్‌వర్కింగ్, బ్యాంకింగ్ ఇలా అనేకమైన ఆన్‌లైన్ అకౌంట్‌లకు సంబంధించి మీరు ఉపయోగించే  పాస్‌వర్డ్‌లన్నింటిని ఒక దగ్గర సురక్షితంగా స్టోర్ చేసుకునేందుకు పాస్‌వర్డ్ మేనేజర్ ఉంటుంది.

సరికొత్త నవీకరణలతో ఒపెరా మినీ 8 బ్రౌజర్

పెరా బ్రౌజర్‌లో ఏర్పాటు చేసిన ‘స్మార్ట్ పేజ్' ఫీచర్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌‍సైట్‌లు ఇంకా ఇతర వెబ్ పేజీలకు వేగంగా కనెక్ట్ కావచ్చు. ఇతర బ్రౌజర్‌లతో పోలిస్లే ఒపెరా మినీ బ్రౌజర్ పదోవంతు బ్యాండ్ విడ్త్ మాత్రమే ఉపయోగిస్తుంది. అలాగే బ్రౌజర్‌లో ఏర్పాటు చేసిన డేటా సేవింగ్ కాలిక్యులేటర్ ద్వారా డేటా వినియోగానికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఓఎస్ కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేయబడిన ఒపెరా మినీ 8 పనితీరును ఒపెరా సాఫ్ట్‌వేర్ వెబ్ ఇవాంజెలిస్ట్ దీక్షిత్ గిజ్‌బాట్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలను క్రింది వీడియోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/dclbahWOrIM?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Opera Discusses New Data Compression Mode in Opera Mini 8 for iOS and More [VIDEO]. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot