ఒప్పో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఫోటో లీక్.. స్పెసిఫికేషన్‌లు, లాంచ్ పూర్తి వివరాలు..!!
ఒప్పో నుంచి ఇవాళ ఒప్పో F27 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. అయితే త్వరలో మరో హ్యాండ్ సెట్ కూడా లాంచ్ కానుంది. సంస్థ తన A సిరీస్ స్మార్ట్ ఫోన్‌ల విస్తరణలో భాగంగా ఒప్పో A3 ప్రో (Oppo A3 Pro Smartphone) భారత్‌లో విడుదల చేయనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో తాజాగా లీక్ అయింది. అయితే చైనా వేరియంట్ కంటే డిజైన్ సహా స్పెసిఫికేషన్ లు, ఫీచర్‌లలోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
91మొబైల్స్ రిపోర్టు ఆధారంగా చైనాలో అందుబాటులో ఉన్న వేరియంట్ భారత్‌లో విడుదల కానున్న ఒప్పో A3 ప్రో వేరియంట్ లో మార్పులు ఉండనున్నాయి. టిప్‌స్టర్ సుదన్షు (@Sudhanshu1414) ఇందుకు సంబంధించిన వివరాలను లీక్ చేశారు. భారత్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ఫోటోను కూడా పోస్టు చేశారు. గ్లోసీ ఫినిష్‌లో పర్పుల్ రంగులో కనిపించింది.

ఈ ఫోటో ఆధారంగా కెమెరా మాడ్యూల్ సహా కెమెరాలు, LED ప్లాష్ లైట్‌ను గుర్తించవచ్చు. మరియు వృత్తాకార ఎడ్జ్‌లను కలిగి ఉంది. అయితే ఈ ఒప్పో A3 ప్రో స్మార్ట్ ఫోన్ భారత్‌లో లాంచ్ గురించి టిప్ స్టర్ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఈ హ్యాండ్ సెట్ ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో కనిపించింది.
ఒప్పో A3 ప్రో భారత్ వేరియంట్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఒప్పో A79 5G హ్యాండ్‌సెట్ కు తర్వాత తరం ఫోన్‌గా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మోడల్ కంటే అప్‌గ్రేడ్ చేసిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
** భారత్ మార్కెట్‌లో ఇవాళ ఒప్పో F27 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. ఈ హ్యాండ్ సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ +256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. ఒప్పో ఆన్ లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా ఇవాళ్టి నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మరియు 67W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 64MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. మరియు 6.7 అంగుళాల 3D కర్వడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








