64MP కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో Oppo 5G స్మార్ట్‌ఫోన్.. ప్రారంభ ధర రూ.17999..!
ఒప్పో నుంచి తాజాగా భారత్ మార్కెట్ లోకి ఒప్పో A3 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ( Oppo A3 Pro Smartphone launched ) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ రెండు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. మరియు 5100mAh బ్యాటరీని కలిగి ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా 10 శాతం క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.
ఒప్పో A3 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఒప్పో A3 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సల్ రిజల్యూషన్ మరియు 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో లాంచ్ అయింది.

ఈ హ్యాండ్‌సెట్ డ్యామేజీ ప్రూఫ్ ఆల్ రౌండ్ ఆర్మర్ బాడీని కలిగి ఉంది. మరియు SGS డ్రాప్ రెసిస్టెన్స్ మరియు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా కలిగి ఉంది. దీంతోపాటు యాంటీ డ్రాప్ షీల్డ్ తో అందుబాటులోకి వస్తుంది. AI లింక్ బూస్ట్ మరియు AI ఎరేజర్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కూడా కలిగి ఉంది.
ఒప్పో A34 ప్రో హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14 ను కలిగి ఉంది. మరియు ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W Supervooc ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.7 అపేచర్‌తో 64MP ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.2 అపేచర్‌తో 8MP కెమెరాను అమర్చారు. పొర్ట్రెయిట్ మోడ్, డ్యూయల్ వ్యూ వీడియోలు సహా అనేక కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంది.
ఒప్పో A3 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది. అదే 8GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. ఒప్పో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సహా ఇతర రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ రెండు రంగుల్లో లభిస్తుంది. స్టారీ బ్లాక్, మూన్‌లైట్ పర్పుల్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో A3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను SBI, HDFC, ICICI, యెస్ బ్యాంకు, IDFC బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. జీరో డౌన్ పేమెంట్ సహా 6 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








