64MP కెమెరా, 6.7 అంగుళాల డిస్‌ప్లేతో ఒప్పో స్మార్ట్‌ఫోన్ విడుదల.. మెరుగైన వాటర్ రెసిస్టెన్స్ సహా కీలక ఫీచర్లు
ఒప్పో నుంచి A3 ప్రో స్మార్ట్ ఫోన్ (Oppo A3 Pro Smartphone) లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తిస్థాయి వాటర్ రెసిస్టెన్స్‌తో రానుంది. దీంతోపాటు డ్రాప్ రెసిస్టెన్స్‌లో మెరుగైన ఫలితాలను సాధించింది. దీంతోపాటు మెరుగైన, స్పెసిఫికేషన్లు ఫీచర్లను కలిగి ఉంది.
ఒప్పో A3 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
ఒప్పో A3 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో లాంచ్ అయింది. మరియు 950 గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. దీంతోపాటు అధిక సూర్యకాంతిలోనూ మెరుగైన విజువల్ అనుభూతిని పొందవచ్చని సంస్థ చెబుతోంది.

ఈ ఒప్పో కొత్త హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 8GB లేదా 12GB ర్యామ్ మరియు 256GB లేదా 512GB UFS 3.1 స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ చిప్‌సెట్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని సంస్థ చెబుతోంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14 పైన పనిచేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 64MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 67W క్విక్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా రోజంతా వినియోగించుకోవచ్చని తెలుస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్ అత్యంత ఆకట్టుకొనే ఫీచర్‌ను కలిగి ఉంది. వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్‌లో IP69, IP68, IP66 రేటింగ్‌లను కలిగి ఉంది. అంటే మెరుగైన వాటర్ రెసిస్టెన్స్‌తో లాంచ్ అయింది. దీంతోపాటు కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, వైఫై 6, బ్లూటూత్ 5.3 మరియు అనేక సెన్సార్లను కలిగి ఉంటుంది.
అయితే ప్రస్తుతం ఈ ఒప్పో A3 ప్రో స్మార్ట్‌ఫోన్ చైనాలో మాత్రమే లాంచ్ అయింది. భారత్‌లో విడుదలపై ఒప్పో సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. చైనాలో ఈ హ్యాండ్‌సెట్ మూడు స్టోరేజీ వేరియంట్‌లో విడుదల అయింది. 8GB ర్యామ్ +128GB స్టోరేజీ, 12GB ర్యామ్ +256GB స్టోరేజీ, 12GB ర్యామ్ +512GB స్టోరేజీ వేరియంట్లలో విడుదల అయింది.
128GB స్టోరేజీ వేరియంట్ ధర 1999 యువాన్ (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.23,000), 256GB స్టోరేజీ వేరియంట్ 2199 యువాన్ (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.25,400), 512GB వేరియంట్ ధర 2499 యువాన్ (భారత కరెన్సీ ప్రకారం రూ.28,880) గా ఉంది. మరియు చైనాలో మౌంటెన్ బ్లూ, లెదర బ్లాక్, యుంజిన్ పింగ్ రంగులో అందుబాటులో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








