ధర రూ.8,999 కే 5100mAh బ్యాటరీ, 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ సేల్.. పూర్తి వివరాలు..!
ఒప్పో నుంచి ఇటీవల ఒప్పో A3x 4G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఇప్పటికే ఈ మోడల్ 5G వేరియంట్ అందుబాటులో ఉంది. అయితే తాజాగా విడుదల చేసిన 4G స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 25 నుంచే ఒప్పో అధికారిక స్టోర్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ్టి నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర స్టోర్‌ల ద్వారా సేల్ ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. మరియు 5100mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒప్పో A3x 4G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.8,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్ పూర్తి వివరాలు.
ఒప్పో A3x 4G సేల్ : ఒప్పో A3x 4G స్మార్ట్‌ఫోన్ (Oppo A3x 4G Smartphone Sale) ప్రస్తుతం రెండు వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. ఒప్పో అధికారిక స్టోర్ సహా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఓషన్ ప్లూ, నెబ్యూలా రెడ్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో A3X 4G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఒప్పో A3X 4G స్మార్ట్‌ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1604*720 పిక్సల్స్ రిజల్యూషన్, 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 264 PPI పిక్సెల్ డెన్సిటీ, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే పాండా గ్లాస్ రక్షణను పొందింది.
కలర్OS 14 సహా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ :
ఈ ఒప్పో హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14 ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6s 4G జెన్ 1 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు Adreno 610 GPU ప్రాసెసర్, 4GB LPDDR4X ర్యామ్, 64GB లేదా 128GB eMMC 5.1 స్టోరేజీతో జతచేయబడి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా ఈ స్టోరేజీని పొడిగించుకొనే అవకాశం ఉంది.
ఒప్పో A3x 4G స్మార్ట్‌ఫోన్ 45W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీని కలిగి ఉంది. 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయవచ్చని సంస్థ చెబుతోంది. కెమెరా విభాగం పరంగా వెనుకవైపు 8MP కెమెరా సహా 0.08MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు వెనుకవైపు LED ఫ్లాష్ లైట్ ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా ఒప్పో స్మార్ట్‌ఫోన్ 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ V5.0, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి కనెక్టింగ్ ఫీచర్‌లతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ మరియు మెరుగైన ఆడియో కోసం మోనో స్పీకర్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








