ధర రూ.12,499 కే 5100mAh బ్యాటరీ, 6.67 అంగుళాల 5G స్మార్ట్‌ఫోన్... ఫీచర్‌లు, సేల్ వివరాలు.!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో భారత్ మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఒప్పో A3x 5G స్మార్ట్‌ఫోన్ (Oppo A3X 5G Smartphone Launched) లాంచ్ అయింది. 5100mAh బ్యాటరీ, 6.67 అంగుళాల LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.12499 గా ఉంది. ఆగస్టు 7 నుంచి ఒప్పో అధికారిక వెబ్‌సైట్, ఈ-స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో A3X 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఒప్పో A3X 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 1604*720 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే ట్వైస్ రెయిన్‌ఫోర్సడ్ పాండా గ్లాస్ రక్షణను కలిగి ఉంటుంది.

ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14.1 పైన పనిచేస్తుంది. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC పైన పనిచేస్తుంది. Arm Mali G57 GPU, 4GB LPDDR4x ర్యామ్, 128GB eMMC 5.1 స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా ఒప్పో A3x 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 8MP ప్రైమరీ కెమెరా. 5MP సెల్ఫీ కెమెరాతో విడుదల అయింది. ఈ ఫోన్ 45W SuperVooc ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఈ ఒప్పో A3x 5G స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ నానో సిమ్, 5G, 4G LTE, వైఫై 5, బ్లూటూత్ 5.3, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ స్ప్లాష్ టచ్ టెక్నాలజీ ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా తడి చేతులతోనూ ఫోన్‌ను నియంత్రించవచ్చు. మరియు MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ షాక్ రిసిస్టెన్స్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది.
ఒప్పో A3X 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఇండియా ఈ-స్టోర్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా ఈ ఒప్పో A3X 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని సంస్థ తెలిపింది. మరియు ఈ హ్యాండ్‌సెట్ స్పార్కిల్ బ్లాక్, స్టార్రీ పర్పుల్, స్టార్‌లైట్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. భద్రత కోసం ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వచ్చింది


Click it and Unblock the Notifications








