Home
Mobile

32MP కెమెరా, 5100mAh బ్యాటరీతో ఒప్పో A3X స్మార్ట్‌ఫోన్‌.. తాజాగా ధర వివరాలు లీక్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో నుంచి త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి ఒప్పో A3X స్మార్ట్‌ఫోన్ (Oppo A3X Smartphone) విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు సహా ఇతర వివరాలు లీక్‌ అయ్యాయి. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌, 5100mAh బ్యాటరీ, 32MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ రక్షణకు ట్యాంపరింగ్‌ గ్లాస్‌, యాంటీ డ్రాప్‌ షీల్డ్‌ కేస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ ఎప్పుడు లాంచ్‌ కానుందనే నమాచారం వెల్లడి కాలేదు.

ఒప్పో A3x స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు ఇప్పటికే లీక్‌ కాగా.. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ ధర వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు 4GB ర్యామ్‌తో జతచేయబడుతుందని తెలుస్తోంది. మరియు 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Oppo A3X Smartphone

ఒప్పో A3X స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలు లీక్‌ :
91మొబైల్స్‌ హిందీ పోర్టల్‌ ఆధారంగా భారత్‌ మార్కెట్‌లో ఈ ఒప్పో A3X స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంటుంది. అదే 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.13,499 గా ఉంటుందని తెలిపింది.

దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ స్పార్కల్‌ బ్లాక్‌, స్టార్‌లైట్‌ వైట్, స్టారీ పర్పుల్ రంగుల్లో లభిస్తుందని తెలిపింది. ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. కొన్ని లీక్‌ల ఆధారంగా 32MP ప్రధాన కెమెరా సహా 5MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది.

Oppo A3X Smartphone

ఒప్పో A3x స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ తో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. మరియు 4GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేయబడుతుంది.

ఈ ఒప్పో A3x స్మార్ట్‌ఫోన్‌ స్ప్లాష్‌ టచ్‌ సపోర్టు ఫీచర్‌ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా తడి చేతులతోనూ హ్యాండ్‌సెట్‌ను నియంత్రించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ భద్రత కోసం డబుల్‌ ట్యాంపరింగ్‌ గ్లాస్‌, యాంటీ డ్రాప్‌ షీల్డ్‌ కేస్‌, అల్లాయ్‌ ఫ్రేమ్‌తో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వస్తుంది. ఈ లీక్‌లపై ఒప్పో ఎటువంటి ప్రకటన చేయలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo A3X Smartphone Price and design leaked and expected to launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X