రూ.15499 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 128GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్..!
OPPO A5 5G Smartphone : ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఒప్పో A5 5G పేరుతో లాంచ్ అయింది. గత నెలలో ఒప్పో A5x 5G హ్యాండ్‌సెట్ విడుదల అయింది. ఒప్పో A5 5G స్మార్ట్‌ఫోన్ 360 డిగ్రీల ఆర్మర్ బాడీని కలిగి ఉంది. దీంతోపాటు ఫోన్ ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా అల్లాయ్ ఫ్రేమ్‌ను కూడా కలిగి ఉంది. మరియు 7.99mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఆరోరా గ్రీన్, మిస్ట్ వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఒప్పో A5 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
ఒప్పో A5 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మరియు ఎక్కువ రోజుల పాటు మన్నిక వచ్చేలా డిజైన్‌ను కలిగి ఉంది.

చిప్‌సెట్ వివరాలు :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్, ARM Mali G57 MC2 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ 6GB/8GB LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. అదనంగా వర్చువల్ ర్యామ్ ఆప్షన్ ద్వారా 8GB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.
కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా f/1.88 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌తో 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. మరియు వెనుక వైపు LED ఫ్లాష్ లైట్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.0 అపేచర్‌తో 8MP కెమెరాతో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.
6000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G NA/NSA, 4G VoLTE, బ్లూటూత్ 5.4, వైఫై 802.11ac, USB-C, GPS వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ కేవలం 194 గ్రాముల బరువుని కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
ఒప్పో A5 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15499 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉంది. ప్రస్తుతం ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలోనూ అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications