Home
Mobile

OPPO A5 Pro 5G Overview : 2025 లో అత్యుత్తమ మన్నికైన స్మార్ట్‌ఫోన్‌

OPPO A5 Pro 5G smartphone

ప్రస్తుతం బెస్ట్‌ ఫోన్‌లను ఎంచుకోవడం చాలా కష్టంగా ఉంది. డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌, మిలిటరీ గ్రేడ్‌ వంటి ఎక్కువ రోజుల పాటు మన్నిక వచ్చే ఫోన్‌ల ఎంపిక మరింత కష్టం. OPPO ఇండియా తమ F సిరీస్‌ నుంచి A సిరీస్‌ వరకు మన్నికైన ఫోన్‌ల కోసం బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేసింది. తాజాగా అలాంటి ఫోన్‌ను లాంచ్‌ చేసింది. OPPO A5 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఇటీవల విడుదల అయింది. ఈ ఫోన్‌ మిడ్‌ రేంజ్‌లో మన్నికైన మోడల్‌గా అందుబాటులోకి వచ్చింది. డిజైన్‌, ఫీచర్‌ల పరంగా ఎక్కడా రాజీలేకుండా ఈ ఫోన్ ను రూపొందించారు.

సాధారణంగా చాలా మందికి ఒక రకమైన అపోహ ఉంటుంది. తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే ఫోన్‌లు ఎక్కువ రోజుల పాటు మన్నిక ఉండవని. అయితే OPPO A సిరీస్‌ కొత్త ఫోన్‌ మీ అంచనా తప్పు అని నిరూపిస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్‌ మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్‌, IP66, IP68, IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు 160 శాతం బలమైన రీన్‌పోర్స్డ్‌ గ్లాస్‌తో రోజువారీ ఒత్తిడిని తట్టుకొనేలా తయారు చేశారు.

ఈ ఫోన్‌ 5800mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు హంటర్‌ యాంటెనా ద్వారా 200 శాతం సిగ్నల్‌ బూస్ట్‌ను అందిస్తుంది. మరియు 7.76mm థిక్‌నెస్‌తో 194 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ పవర్‌, పోర్టబిలిటీని బ్యాలెన్స్‌ చేస్తుంది. ఇతర స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు తక్కువ ధరకు ఫోన్‌లను అందించేందుకు వీలుగా బిల్ట్‌ క్వాలిటీపైన ఎక్కువ దృష్టి పెట్టలేదు. అయితే OPPO మాత్రం అన్ని పరిస్థితులను తట్టుకొనేలా బెస్ట్‌ మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.

OPPO A5 Pro 5G smartphone

బిల్ట్‌ క్వాలిటీ, డ్యూరబిలిటీ :
ఈ ఫోన్‌ చాలా మన్నికైనది. ఈ ఫోన్‌ IP66, IP68, IP69 రేటింగ్‌తో కూడిన కాఫీ, సాల్ట్‌ వాటర్‌, చెమట సహా ఇతర 18 రకాల లిక్విడ్స్‌ నుంచి బలమైన రక్షణ కల్పిస్తుంది. ఈ ఫోన్‌ నీటిలో పడినా డ్యామేజీ కాదు. మరియు వర్షంలో తడుస్తున్నా ఆందోళన అవసరం లేదు. మరియు ఎక్కువ దుమ్ము దూళి వచ్చే ప్రాంతంలోనూ ఈ ఫోన్ డ్యామేజీ కాదు.

ఒప్పో A5 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ MIL-STDH మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. అధిక ఉష్ణోగ్రత, వర్షం, డస్ట్‌, సాల్ట్‌ మిస్ట్, షాక్స్‌ వంటి 14 మిలిటరీ కండిషన్స్‌లో పరీక్షించారు.

OPPO A5 Pro 5G smartphone

ఈ ఫోన్‌ AM04 ఏరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. రీన్‌ఫోర్డ్స్‌ డబుల్‌ టెంపరింగ్ గ్లాస్‌ సాధారణ గ్లాస్‌ తో కూడిన స్మార్‌ఫోన్‌ల కంటే 160 శాతం ఎక్కువ డ్రాప్‌ రెసిస్టెంట్‌గా ఉంది. దీంతోపాటు OPPO స్పాంజ్‌ బయోనిక్‌ కుషనింగ్‌ ప్రమాదాల సమయంలో షాక్‌ అబ్జార్బర్‌ మాదిరిగా పనిచేసి, ఫోన్‌ అంతర్గత భాగాలను డ్యామేజీ కాకుండా చూస్తుంది.

OPPO A5 Pro 5G smartphone

సిగ్నల్‌ ఇబ్బందే రాదు.. ఎందుకంటే
ఏదైనా ముఖ్యమైన మెయిల్‌ లేదా మెసేజ్‌లను పంపాలని ప్రయత్నం చేసినప్పుడు కొన్నిసార్లు ఫోన్ సిగ్నల్‌ చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే ఒప్పో A5 ప్రో 5G ఫోన్‌లో ఈ సమస్య ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఈ ఫోన్‌ AI LinkBoost 2.0 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్‌ స్మార్ట్‌ అల్గారిథం, 360 డిగ్రీ సరౌండ్‌ యాంటెన్నా వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఫలితంగా డెడ్‌ జోన్లు సహా బలహీన మైన ప్రాంతాల్లోనూ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

మైక్రో స్లిట్‌ యాంటెనా, 4x4 MIMO 9B40, B3, B39) ద్వారా 200 శాతం మెరుగైన సిగ్నల్‌, 84.2 శాతం యాంటెనా కవరేజీ, 30 శాతం లో లేటెన్సీని అందిస్తుంది. దీంతోపాటు BeaconLink ద్వారా జీరో నెట్‌వర్క్‌ కవరేజీ ఉన్న ప్రాంతంలోనూ 205 మీటర్ల వరకు బ్లూటూత్ వాయిస్‌ కాలింగ్‌ను సపోర్టు చేస్తుంది. గ్రామీణ లేదా తక్కువ నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతాల్లో మెరుగైన అనుభూతిని అందిస్తుంది.

OPPO A5 Pro 5G smartphone

పనితీరు ఎలా ఉంటుందంటే
ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 12GB ర్యామ్‌ (ర్యామ్‌ పొడిగింపుతో) మరియు 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ మల్టీ టాస్కింగ్‌, గేమింగ్‌, ప్రొడక్టివిటీని మెరుగ్గా అందిస్తుంది. ColorOS 15 తో కూడిన OPPO ట్రినిటీ ఇంజిన్‌ స్మూత్‌ పెర్ఫామెన్స్‌ ను అందిస్తంది. ఇది OPPO 48 నెలల వ్యాలిడిటీతో ఫ్లూయన్సీ ప్రొటెక్షన్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది.

హెవీ యాప్స్‌ను వినియోగిస్తున్నా.. మల్టీ టాస్కింగ్‌, ఎడిటింగ్‌ వంటి అనేక సందర్భాల్లో ఈ ఫోన్‌ మెరుగైన పనితీరును అందిస్తుంది. AI GameBoost ఫీచర్‌ ఫ్రేమ్‌ రేట్‌ ను స్థిరంగా ఉండేలా చూసి, ల్యాగ్‌ ఫ్రీ గేమింగ్‌ ఫెర్ఫామెన్స్‌ను అందిస్తుంది. దీంతోపాటు మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 1100mm sq VC కూలింగ్ సిస్టమ్‌ ను కలిగి ఉంది.

PUBG, MLBB, Free Fire వంటి గేమ్స్‌ను కూడా 8 గంటలకు పైగా ఆడుకొనేందుకు అవకాశం ఉంటుంది. గేమర్స్‌ ఈ ఫోన్ మెరుగైన ఎంపికగా ఉంటుంది. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లతో అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ కారణంగా మెరుగైన ఆడియో అనుభూతిని పొందవచ్చు. ఈ ఫీచర్‌ సౌండ్‌ అవుట్‌పుట్‌ను 300 శాతం వరకు పెంచుతుంది. మరియు ఎలాంటి వాతావరణంలో అయినా కాల్స్‌, మ్యూజిక్‌, గేమింగ్‌ సౌండ్‌ క్లియర్‌గా ఉండేలా చూస్తుంది.

OPPO A5 Pro 5G smartphone

ఆకట్టుకొనే డిజైన్‌
ఈ ఫోన్‌ మెరుగైన ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లతోపాటు 7.76mm థిక్‌నెస్‌తో 194 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సాఫ్ట్ మ్యాటీ టెక్చర్‌తో కూడిన మోచా బ్రౌన్‌, స్క్రాచ్‌ రెసిస్టెన్స్‌తో కూడిన ఫెదర్‌ బ్లూ వేరియంట్స్‌లో లభిస్తుంది. దీంతోపాటు OPPO గ్లౌ ఫినిష్ మిమిక్‌ ఫెదర్‌ ప్యాట్రన్‌ ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.67 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను సపోర్టు చేస్తుంది. ఈ డిస్‌ప్లే స్ల్పాష్‌ టచ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే నూనె, తడి చేతులతోనూ ఈ ఫోన్‌ ను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు గ్లౌజ్‌ తోనూ వినియోగించుకోవచ్చు.

OPPO A5 Pro 5G smartphone

ఎక్కువ రోజుల బ్యాటరీ లైఫ్‌
ఈ ఫోన్‌ 5800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 16.1 గంటల వరకు యూట్యూబ్‌ వీడియో ప్లేబ్యాక్‌, 35.7 గంటల కాలింగ్ టైం, 31.3 గంటల మ్యూజిన్‌ స్ట్రీమింగ్‌ కోసం వినియోగించుకోవచ్చు. హెవీ యూజర్లకు కూడా సౌకర్యంగా ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 45W SUPERVOOCTM ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. కేవలం 83 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు. 1600 ఫుల్‌ ఛార్జింగ్ సైకిల్స్‌ అంటే నాలుగు సంవత్సరాల వరకు మెరుగైన పనితీరును అందిస్తుంది. బ్యాటరీ హెల్త్ పై ఎటువంటి ఆందోళన లేకుండా ఫోన్‌ను ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు.

OPPO A5 Pro 5G smartphone

మెరుగైన కెమెరాలు
OPPO A5 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యంత మెరుగైన కెమెరా అనుభూతిని అందిస్తుంది. ఈ ఫోన్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP పొర్ట్రెయిట్‌ కెమెరా, డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు AI ఫీచర్‌లు కూడా ఉన్నాయి. AI పొర్ట్రెయిట్‌ తోపాటు లైఫ్‌ఫోటో ఫీచర్‌లు మెరుగైన కెమెరా అనుభూతిని అందిస్తాయి.

ఈ ఫోన్‌లో తొలిసారిగా అండర్‌ వాటర్ ఫోటోగ్రఫీ మోడ్‌ను అందించారు. ఈ ఫీచర్‌ తొలుత Reno13 సిరీస్‌లో కనిపించింది. నీటిలో షార్ప్‌, వైబ్రంట్‌ ఫోటోలను క్యాప్చర్‌ చేయవచ్చు. దీంతోపాటు AI Eraser 2.0, AI Clarity, AI Reflection Remover వంటి ఫీచర్‌లతో ఫోటోలను నచ్చినట్లుగా ఎడిటింగ్‌ చేసుకోవచ్చు.

ఈ ఫోన్ ఫోన్ డ్యూయల్‌ వ్యూ వీడియో ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. అంటే ముందు, వెనుక కెమెరాల ద్వారా ఒకేసారి వీడియోను క్యాప్చర్‌ చేయవచ్చు. ఈ ఫీచర్‌ క్రియేటర్లకు బాగా ఉపయోగపడుతుంది. రీల్స్‌, వ్లాగ్స్‌ క్రియేట్‌ చేసే సమయంలో ఉపయోగపడుతుంది.

ఫోన్‌ OS పనితీరు ఎలా ఉంటుంది
OPPO A5 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ColorOS 15 పైన పనిచేస్తుంది. దీని ద్వారా అనేక ఫీచర్‌లు అందుబాటులోకి తెచ్చింది. ట్రినిటీ ఇంజిన్‌ కారణంగా మల్టీ టాస్కింగ్‌, మల్టిపుల్‌ యాప్‌ల వినియోగం సమయంలోనూ మెరుగైన పనితీరును అందిస్తుంది. AI Studio ద్వారా ఫోటోలను ఎడిటింగ్‌ చేసుకోవచ్చు. మరియు GIF ఇమేజ్‌లను క్రియేట్‌ చేసుకోవచ్చు. మరియు యానిమేటెడ్‌ వాల్‌పేపర్స్‌గా మార్చుకోవచ్చు. AI Notes, AI Documents ఫీచర్‌లు విద్యార్థులుతోపాటు ఇతర నిపుణులకు బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు రీరైట్‌, ట్రాన్సిలేట్‌ ఫీచర్‌ కూడా ఉపయోగపడతాయి. హిందీ నుంచి ఇంగ్లీష్‌ మరియు ఇంగ్లీష్‌ నుంచి హిందీలోకి అనువాదం చేసుకోవచ్చు. వీటితోపాటు AI Unblur, AI Reflection Remover ఫీచర్‌లు ఫోటోలను మీకు నచ్చినట్లు మార్పుకొనే అవకాశం కల్పిస్తాయి.

అవుట్‌డోర్‌ మోడ్‌
ఈ OPPO ఫోన్‌లో అవుట్‌డోర్‌ మోడ్‌ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. అవసరమైన యాప్స్‌ పనితీరు మెరుగుపరుస్తుంది. మరియు సిగ్నల్‌ ను ఆప్టిమైజ్‌ చేస్తుంది. మరియు స్క్రీన్ టైంను పెంచుతుంది. దీంతోపాటు గ్లౌజ్‌ తోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు.

గడ్డకట్టిన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో, బ్రైట్‌ సన్‌ లైట్‌లోనూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రాక్టికల్ గా అనేక ఫీచర్‌లు యూజర్లకు వినియోగపడతాయి.

OPPO A5 Pro 5G smartphone

ఈ ఫోన్ గురించి ఒక్క మాటలో
OPPO A5 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.17999 గా ఉంది. ఈ ధరలో స్పెసిఫికేషన్‌లతో గట్టి పోటీనివ్వడమే కాకుండా.. మనిషి నిజ జీవితంలో అన్ని సందర్భాల్లో ఉపయోగపడేలా మరియు ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఎక్కువ రోజుల పాటు ఉపయోగించేందుకు మంచి ఫోన్ కావాలనుకొనే వారికి ఈ హ్యాండ్‌సెట్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా నిలుస్తుంది.

మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెన్స్‌ నుంచి డస్ట్ మరియు వాటర్‌ రేటింగ్‌ వరకు మరియు బ్యాటరీ లైఫ్, గేమింగ్ పనితీరు, AI ఫీచర్లు ఇలా అన్నింటా A5 Pro 5G ఫోన్ ఆకట్టుకుంటుంది. యూజర్లకు ఏమేం ఫీచర్‌లు కూవాలో ఈ ఫోన్‌ అన్నింటనీ కలిగి ఉంటుంది.

OPPO A5 Pro 5G smartphone

ధర, సేల్‌ వివరాలు
OPPO A5 Pro 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.19999 గా ఉంది. ఈ ఫోన్‌ను Amazon, Flipkart, e-OPPO Store సహా ప్రధాన రిటైల్‌ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. మోచా బ్రౌన్‌, ఫెదర్ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. SBI, IDFC ఫస్ట్‌ బ్యాంకు, BOB ఫైనాన్సియల్‌, ఫెడరల్ బ్యాంకు, DBS క్రెడిట్‌ కార్డులపై గరిష్ఠంగా రూ.1500 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. మరియు 6 నెలల వరకు నో కాస్ట్‌ EMI తోపాటు జీరో డౌన్‌ పేమెంట్‌ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
OPPO A5 Pro 5G Overview The Best Durable smartphone of 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X