ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. IP69 రేటింగ్, 5800mAh బ్యాటరీ.. ఎప్పుడు విడుదల కానుందంటే..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో నుంచి భారత్ మార్కెట్‌లో త్వరలో A సిరీస్ హ్యాండ్‌సెట్ విడుదల కానుంది. ఒప్పో A5 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (OPPO A5 Pro 5G Smartphone) ఏప్రిల్ 24 వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్ డిజైన్‌ను కూడా షేర్ చేసింది. దీంతోపాటు ఒప్పో K13 5G హ్యాండ్‌సెట్ కూడా ఏప్రిల్ 21 న విడుదల కానుంది. ఒప్పో A5 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
ఒప్పో A5 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ రగ్గడ్ మోడల్ డిజైన్ తో అందుబాటులోకి రానుంది. మరియు ఎక్కువ రోజులపాటు మన్నిక ఉండేలా IP69 రేటింగ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తోపాటు 360 శాతం ఆర్మర్ బాడీ తో లాంచ్ కానుంది. ఫలితంగా మెరుగైన డ్రాప్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, బ్యాటరీ, చిప్‌సెట్, కెమెరా సహా మరిన్ని వివరాలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఒప్పో A5 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళా HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే OS వివరాలు సహా ఫోన్ ఎన్ని సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుందో తెలియాల్సి ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ రూ.20 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
ఒప్పో స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 2MP మరో లెన్స్‌ను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చే అవకాశం ఉంది.
Meet the new powerhouse in the durable champion family — OPPO A5 Pro 5G, launching on 24th April 2025! Made to survive the slips, splashes, and surprises.#OPPOA5Pro5G #AStepAhead #DurableChampionFamily pic.twitter.com/tE0bvTVaDn
— OPPO India (@OPPOIndia) April 18, 2025
ఒప్పో కొత్త ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీతో పనిచేస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన సిగ్నల్ స్ట్రెంత్‌ను పొందేలా ప్రత్యేక ఫీచర్ ను కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది.
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 21 వ తేదీన భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఐసీ పర్పుల్, ప్రిజమ్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.
ఒప్పో K13 5G హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.66 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేతో కలిగి ఉంటుందని తెలుస్తోంది. 4nm స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Color OS 15 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications