Home
Mobile

5800mAh బ్యాటరీ, 6.67 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా OPPO 5G ఫోన్‌ విడుదల.. సేల్‌ ప్రారంభం..

ఒప్పో నుంచి భారత్ మార్కెట్‌లోకి ఇవాళ బడ్జెట్‌ రేంజ్ ధరలో ఒప్పో A5 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. మూడు రోజుల ముందే ఒప్పో నుంచి 7000mAh బ్యాటరీతో K13 5G ఫోన్‌ లాంచ్ కాగా.. ఇవాళ మరో హ్యాండ్‌సెట్ లాంచ్ అయింది. A5 ప్రో 5G హ్యాండ్‌సెట్ (OPPO A5 Pro 5G Smartphone Launched) అనేక మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు IP66 + IP68 + IP69 రేటింగ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఒప్పో ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

ఒప్పో A5 ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ (720*1604 పిక్సల్స్) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

OPPO A5 Pro 5G Smartphone telugu news

చిప్‌సెట్ :
ఒప్పో హ్యాండ్‌సెట్‌ 6nm ఆక్టా కోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ గరిష్ఠంగా 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 (Out of the box) తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 8GB/128GB, 8GB/256GB వేరియంట్స్‌లో లభిస్తుంది.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ ఒప్పో ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP డెప్త్‌ సెన్సార్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం f/2.0 అపేచర్‌తో 8MP కెమెరాను కలిగి ఉంది.

OPPO A5 Pro 5G Smartphone telugu news

అనేక ఫీచర్‌లు :
ఈ ఫోన్ అనేక ఇమేజింగ్‌ మరియు ఎడిటింగ్‌ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. ఇందులో Livephoto, AI Reflection Remover, AI Unblur, AI Eraser, AI స్మార్ట్‌ ఇమేజ్‌ మ్యాటింగ్‌ 2.0 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఈ ఫోన్‌ సైడ్‌ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

IP69 రేటింగ్‌ :
ఒప్పో A5 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 45W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP66 + IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.3, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

ఒప్పో A5 ప్రో 5G స్మా్ర్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఒప్పో A5 ప్రో 5G స్మా్ర్ట్‌ఫోన్‌ (OPPO A5 Pro 5G Sale) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.19,999 గా ఉంది. ఈ ఫోన్‌ను ప్రస్తుతం ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

SBI, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, IDFC ఫస్ట్‌ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంక్‌, DBS బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా 1500 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. మరియు 6 నెలల వరకు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలకు కూడా పొందవచ్చు. ఈ ఫోన్‌ ఫెదర్‌ బ్లూ, మోచా బ్రౌన్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO A5 Pro 5G Smartphone launched with 5800mAh Battery and IP69 Rating in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X