Home
Mobile

ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌.. IP69 రేటింగ్‌, 50MP కెమెరా.. రేపే విడుదల!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో నుంచి ఇటీవల 7000mAh బ్యాటరీతో ఒప్పో K13 5G విడుదల అయింది. రూ.17999 ప్రారంభ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్‌ 25 నుంచి భారత్ మార్కెట్‌లో సేల్‌ ప్రారంభం కానుంది. ఒప్పో నుంచి రేపు (ఏప్రిల్‌ 24) మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి.

ఒప్పో A5 Pro 5G స్మార్ట్‌ఫోన్ (Oppo A5 Pro 5G Smartphone) భారత్ మార్కెట్‌లో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే 1604*720 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Oppo A5 Pro 5G smartphone launching on tomorrow with IP69 Rating in india

ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ ఫోన్ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్‌ను కూడా కలిగి ఉంటుంది. ముందువైపు ఈ హ్యాండ్‌సెట్‌ 8MP కెమెరాను అమర్చి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5800mAh బ్యాటరీతో లాంచ్‌ కానుంది. మరియు ఈ ఫోన్‌ IP69 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి రానుంది. మరియు భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.17999 గా ఉంటుందని సమాచారం.

ఇటీవల ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల అమోలెడ్‌ ఫ్లాట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 4 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంది. థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 6000mm Sq గ్రాఫైట్‌ షీట్‌, 5700mm Sq భారీ వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 80W Supervooc ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. 100 శాతం ఛార్జింగ్‌ను 56 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. కెమెరా విభాగం పరంగా డ్యూయల్‌ కెమెరాలను అమర్చారు. 50MP ప్రైమరీ కెమెరా, 2MP కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19999 గా ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. IR రిమోట్‌ కంట్రోల్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్‌లున్నాయి.

Best Mobiles in India

English summary
Oppo A5 Pro 5G smartphone launching on tomorrow with IP69 Rating in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X