Home
Mobile

కిందపడినా డ్యామేజీ కాని స్మార్ట్‌ఫోన్‌ పై డిస్కౌంట్‌.. IP69 రేటింగ్‌ సహా సూపర్‌ ఫీచర్లు!

ఒప్పో నుంచి ఈ సంవత్సరం భారత్ మార్కెట్‌ లో అనేక మోడల్స్‌ లాంచ్‌ అయ్యాయి. ఇందులో బడ్జెట్‌ రేంజ్‌ నుంచి మిడ్‌రేంజ్‌ మోడల్స్‌ కూడా ఉన్నాయి. వచ్చే వారంలో ఫైండ్‌ X9 సిరీస్‌ భారత్‌ మార్కెట్‌ లో లాంచ్ కానుంది. అయితే ఈ సంవత్సరం తొలిభాగంలో విడుదల అయిన ఒప్పో A5 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ను (OPPO A5 Pro 5G Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

రూ.1000 డిస్కౌంట్‌ :
ఒప్పో A5 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19,999 గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్టంగా రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

OPPO A5 pro 5G smartphone telugu news

కిందపడినా డ్యామేజీ కాకుండా! :
ఒప్పో A5 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ఆర్మర్‌ బాడీ 360 డిగ్రీ డ్రాప్‌ ప్రూఫ్‌ ప్రొటెక్షన్‌ ను కలిగి ఉంది. అంటే పొరపాటున కిందపడినా డ్యామేజీ కాకుండా ఉంటుంది. దీంతోపాటు IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. 1.5 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాలపాటు ఉంచినా, డ్యామేజీ కాకుండా ఉంటుందని ఒప్పో తెలిపింది.

కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ :
ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ ను పొందుతోంది. ఈ ఫోన్‌ ఫెదర్‌ బ్లూ, మోచా బ్రౌన్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

OPPO A5 pro 5G smartphone telugu news

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ ఒప్పో ఫోన్‌ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తోంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటి అప్‌డేట్స్‌ ను పొందుతుందని హామీ ఇచ్చింది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ AI Eraser, AI Unblur, Reflection Remover వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

5800mAh ఛార్జింగ్‌ సపోర్టు :
ఈ ఒప్పో హ్యాండ్‌సెట్‌ 45W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ భద్రత కోసం ఫేస్‌ అన్‌లాక్‌, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 5G, 4G, బ్లూటూత్‌ 5.3, వైఫై, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO A5 pro 5G smartphone with armour body, IP69 Rating gets Rs1000 discount on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X