30 నిమిషాలపాటు నీటిలో ఉన్నా డ్యామేజీ కాని స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా సహా..!
ఒప్పో నుంచి ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. రెండు నెలల క్రితం ఒప్పో K13 5G ఫోన్‌ను 7000mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.18 వేల ధరకు అందుబాటులో ఉంది. అయితే ఇదే ధరలో ఒప్పో ఏప్రిల్ నెలలో ఒప్పో A5 ప్రో 5G ఫోన్ విడుదల అయింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ HD+ డిస్‌ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్ వివరాలు.
భారత్ మార్కెట్‌లో ఒప్పో ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో A5 ప్రో 5G స్మా్ర్ట్‌ఫోన్ (OPPO A5 Pro 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19,999 గా ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే SBI క్రెడిట్ కార్డు నాన్ EMI లావాదేవీలపై రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
ఒప్పో A5 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6nm ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంది.
5800mAh బ్యాటరీ :
ఈ ఫోన్ మూడు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందవచ్చు. ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ 45W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఫెదర్ బ్లూ, మోచా బ్రౌన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
డ్రాప్ రెసిస్టెంట్ :
డిజైన్ పరంగా ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. మరియు ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా అనేక ఫీచర్‌లున్నాయి. ఆర్మర్ బాడీ 360 డిగ్రీ డ్రాప్ ప్రూఫ్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. అంటే పొరపాటున కింద పడినా డ్యామేజీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
IP69 రేటింగ్ :
ఈ ఫోన్ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 720 x 1604 పిక్సల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ ప్రూఫ్‌గా ఉంది. అంటే 80c, 1.5 మీటర్ల నీటి లోతులో 30 నిమిషాలు పాటు ఉంచినా డ్యామేజీ కాకుండా ఉంటుందని ఒప్పో చెబుతోంది.
కెమెరా విభాగం పరంగా డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరాతో అమర్చారు. ఈ ఫోన్ AI స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0, Reflection Remover, Livephoto, AI Unblur, AI Eraser వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఆప్షన్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టు ఉంది.


Click it and Unblock the Notifications