భార‌త మార్కెట్లో Oppo A57 2022 విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ Oppo భార‌త‌ మార్కెట్లోకి మ‌రో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. Oppo A57 2022 మొబైల్‌ను భార‌త మార్కెట్లోకి విడుద‌ల చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా కంపెనీ ట్వీట్‌లో Oppo A57 2022 మొబైల్‌కు సంబంధించిన ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల‌ను విడుద‌ల చేసింది. ఈ మొబైల్ డ్యుయ‌ల్ ప్రైమ‌రీ కెమెరాల‌తో హెచ్‌డీ డిస్‌ప్లేను క‌లిగి ఉంది.

 

Oppo A57 2022 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు..

Oppo A57 2022 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు..

ఈ మొబైల్ కు 6.56 అంగుళాల ఫుల్ HD+ display అందిస్తున్నారు. ఇది 60Hz రిఫ్రెష్ రేట్ తో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ డ‌స్ట్ రెసిస్టాన్స్‌ను క‌లిగి ఉంది. దీని డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ను క‌లిగి ఉంది. ఇది 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ ను అల్యూమినియం తో స్క్వేర్ షేప్‌లో రూపొందించారు. ఈ మొబైల్ ColorOS 12.1, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ octa-core MediaTek Helio G35 ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది.ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. ఇది 720x1612 pixels (HD+) రిసొల్యూష‌న్ క‌లిగి ఉంది. అంతేకాకుండా వైఫై, బ్లూటూత్ v5.00 ఫీచ‌ర్ క‌లిగి ఉంది.

Oppo A57 2022 కెమెరా, ధ‌ర‌..
 

Oppo A57 2022 కెమెరా, ధ‌ర‌..

ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డ్యుయ‌ల్‌ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. 13 మెగాపిక్స‌ల్ (f/2.2) క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 2 మెగా పిక్స‌ల్ (f/2.2) క్వాలిటీతో రెండో కెమెరాను అందిస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఈ మొబైల్ సింగిల్ వేరియంట్ 4GB RAM and 64GB లో ల‌భిస్తుంది. Oppo A57 2022 అఫ‌ర్డ‌బుల్ బ‌డ్జెట్ మొబైల్‌. ఈ మొబైల్ కు భార‌త మార్కెట్లో మంచి డిమాండ్ ఉండ‌నుంది. భార‌త మార్కెట్లో దీని ధ‌రను కంపెనీ రూ.13,999 గా నిర్ణ‌యించింది. ఈ హ్యాండ్‌సెట్లు కంపెనీ సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి గ్రీన్‌, బ్లాక్ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉన్నాయి. లాంచ్ ఆఫ‌ర్ కింద బ్యాంక్ ఆఫ్ బ‌రోడా క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల‌తో కొనుగోలు చేయ‌డం ద్వారా రూ.1,500 ల‌ను కంపెనీ డిస్కౌంట్ ఇస్తోంది.

Oppo Reno 8 Pro కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది..

Oppo Reno 8 Pro కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది..

Oppo Reno 8 Pro మొబైల్ కూడా భార‌త్‌లో త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆ మొబైల్‌కు సంబంధించిన స్పెసిఫికేష‌న్లు లీక‌య్యాయి. ఈ మొబైల్‌ MediaTek Dimensity 8100 (or 8100 Max) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వ‌ర్శ‌న్‌ పై ప‌ని చేస్తుంది. మొబైల్ కు 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+OLED డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పని చేస్తుంది. ఈ మొబైల్ Mediatek's Dimensity 8100 మోడ‌ల్ చిప్ సెట్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ర్యామ్ సామ‌ర్థ్యం ఆధారంగా రెండు వేరియంట్ల‌లో రానుంది. వాటిలో 8GB RAM + 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో ఒక వేరియంట్ వ‌స్తుండ‌గా, 12GB RAM + 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో మ‌రో వేరియంట్ రానుంది. దీనికి క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 778జీ ప్రాసెస‌ర్ అందిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌ని చేస్తుంది.

ఇటీవ‌లే Oppo K10 5G విడుద‌ల‌...

ఇటీవ‌లే Oppo K10 5G విడుద‌ల‌...

ఒప్పొ సంస్థ ఇటీవ‌లె భార‌త్లో Oppo K10 5G మొబైల్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇది కూడా బ‌డ్జెట్ మొబైల్‌ కావ‌డం విశేషం. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డ్యుయ‌ల్‌ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. భార‌త మార్కెట్లో దీని ధ‌రను కంపెనీ రూ.17,499 గా నిర్ణ‌యించింది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 33వాట్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Oppo A57 2022 Mobile launched in india.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X