Home
Mobile

Oppo A59 5G: కొత్త ఫోన్‌ విడుదల.. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.1500 వరకు తగ్గింపు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో A59 5G స్మార్ట్‌ఫోన్‌ను (Oppo A59 5G smartphone) ఆవిష్కరించింది. ఈ ఫోన్ గత సంవత్సరం నవంబర్‌లో విడుదలైన A58 5G స్మార్ట్‌ఫోన్‌కు తర్వాత తరం ఫోన్‌గా లాంచ్‌ అయింది. ఒప్పో A59 5G హ్యాండ్‌సెట్ స్లిమ్‌ బాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా 720 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో రానుంది.

ఒప్పో A59 5G స్మార్ట్‌ఫోన్ లభ్యత : ఒప్పో A59 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.14999గా ఉంది. అదే 6GB ర్యామ్‌, 128GB స్టోరేజీ వేరియంట్‌లోనూ అందుబాటులో ఉంది. ఒప్పో A59 5G స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 25 నుంచి ఒప్పో స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ మరియు ఇతర అవుట్‌లెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

 oppo-a59-5g-smartphone

ఒప్పో A59 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ఆఫర్‌ కింద ఒప్పో ఉత్తమ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. SBI కార్డు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఏయూ ఫైనాన్స్‌ బ్యాంక్‌ మరియు వన్‌ కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా రూ.1500 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. మరియు 6 నెలల వరకు నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఉంది.

ఆకర్షణీయమైన బహుమతులు : ఈఎంఐ ఆప్షన్‌ రూ.1,699 వద్ద ప్రారంభం కానుంది. దీంతోపాటు మై ఒప్పో ఎక్లూజివ్‌ ఆఫర్ కింద.. A59 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన కస్టమర్లు బహుమతులు కూడా గెలుచుకోవచ్చని సంస్థ తెలిపింది. ఒప్పో A59 5G స్మార్ట్‌ఫోన్‌ సిల్క్‌ గోల్డ్‌, స్టారీ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

 oppo-a59-5g-smartphone

ఒప్పో A59 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రాసెసర్‌, ఓఎస్‌ వివరాలు : ఒప్పో A59 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్‌OS 13.1 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 90Hz డిస్‌ప్లే రీఫ్రెష్‌ రేట్‌ మరియు 750 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో రానుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్‌సెట్‌తో Mali-G57 MC2 GPUపైన పనిచేస్తుంది.

ఒప్పో A59 5G స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు : ఒప్పో A59 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు f2.2 అపేచర్‌తో 13MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. మరియు f/2.4 అపేచర్‌తో 2MP క్యామెరాతో వస్తుంది. ముందువైపు f/2.0 అపేచర్‌తో 8MP కెమెరాను కలిగి ఉంటుంది.

మరియు ఈ ఒప్పో ఫోన్‌ 33W సూపర్‌వోక్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కేవలం 30 నిమిషాల్లో 52 శాతం ఛార్జింగ్‌ పూర్తవుతుందని ఒప్పో సంస్థ చెబుతోంది. ఒప్పో A59 5G స్మార్ట్‌ఫోన్‌ USB-C ఛార్జింగ్‌ పోర్టు, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌ను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo A59 5G smartphone launched at rs14999 ఒప్పో A59 5G
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X