Home
Mobile

రూ.11399 ధరకే 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్‌, SGS సర్టిఫికేషన్‌లు కలిగిన 5G స్మార్ట్‌ఫోన్‌!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో భారత్ మార్కెట్‌లో ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ సెగ్మెంట్‌, మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో అనేక మోడల్స్‌ను లాంచ్‌ చేసింది. ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా ఒప్పో తన మోడల్స్‌ను లాంచ్‌ చేస్తోంది. ఈ సంవత్సరం తొలి భాగంలో విడుదల అయిన ఒప్పో A5x 5G స్మార్ట్‌ఫోన్‌ ను (OPPO A5x 5G Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో A5x 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.13,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 4GB/128GB వేరియంట్‌ ధర రూ.11,399 గా ఉంది. అంటే రూ.2600 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

OPPO A5x 5G Smartphone

అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.13999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 4GB/64GB స్టోరేజీ వేరియంట్‌ కూడా సుమారు రూ.10 వేల ధరకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మిడ్‌నైట్‌ బ్లూ, లేజర్‌ వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఒప్పో A5x 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

మిలిటరీ గ్రేడ్‌, SGS సర్టిఫికేషన్ :
ఒప్పో A5x 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మిలటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. మరియు SGS గోల్డ్‌ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే స్ల్పాష్‌ టచ్‌, గ్లౌజ్‌ టచ్‌ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులు, గ్లౌజ్‌తోనూ ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు.

మీడియాటెక్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 OS :
ఈ హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 4GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ వర్చువల్‌ ర్యామ్‌ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది.

OPPO A5x 5G Smartphone

ఆప్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
ఒప్పో A5x 5G స్మార్ట్‌ఫోన్‌ ట్రినిటీ ఇంజిన్‌ ను కూడా కలిగి ఉంది. దీంతోపాటు AI Unblur, AI Eraser 2.0, Reflection Remover, AI Clarity Enhancer, AI Smart Image Matting 2.0 వంటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్‌లను కలిగి ఉంది.

6000mAh భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలు ఉన్నాయి. 32MP ప్రైమరీ కెమెరా (AF), మరో డెప్త్‌ సెన్సర్‌ను అమర్చారు. ముందు వైపు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.

IP65 రేటింగ్‌ :
ఈ ఒప్పో హ్యాండ్‌సెట్‌ సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్‌ 5.1, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO A5x 5G Smartphone with 6000mAh Battery gets best deal on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X